మెగా అభిమానులందర్నీ జనసేన కోసం పని చేసేలా ఓ పెద్ద కార్యక్రమాన్నే జనసేన అగ్రనేతలు చేపట్టారు. కొద్ది రోజుల కిందట.. చిరంజీవి, పవన్, రామ్ చణ్ అభిమానుల పేరుతో విజయవాడలో ఓ సమావేశం నిర్వహించి.. అందరూ జనసేనకే పని చేయాలని నిర్దేశించారు. తర్వాత వరుసగా అభిమానులతో సమావేశం పెడుతున్న నాగబాబు… జనసేన కోసం పని చేయాలని నిర్దేశిస్తున్నారు. తాజాగా మంగళగిరిలో మరోసారి నాదెండ్ల మనోహర్ చిరంజీవి అభిమానులతో భేటీ అయ్యారు. జనసేన కోసం అందరూ పని చేయాలని సూచించాురు.
చిరంజీవి అభిమానులు జనసేన కోసం పని చేయడం లేదని ఎందుకు అనుకుంటున్నారో కానీ ఇలా వరుసగా సమావేశాలు నిర్వహిస్తూండటం మాత్రం ఆసక్తి రేపుతోంది. పైగా నాగబాబు .. జనసేన కోసం పని చేసే వారు మాత్రమే అభిమానులని విశాఖలో వ్యాఖ్యలు చేయడం కూడా వైరల్ అయింది. నిజానికి మెగా ఫ్యాన్స్ అంటే చిరంజీవి ఫ్యాన్సే. ఆయన ఫ్యాన్సే ఇతర మెగా ఫ్యామిలీకి ఫ్యాన్స్ గా ఉన్నారు. ప్రత్యేకంగా లేరు. ఆ విషయాన్ని అందరూ ఒప్పుకుంటారు. అయినా అభిమానుల్ని ఎందుకు అలా ఒత్తిడి చేస్తున్నారో వారికి కూడా అర్థం కావడం లేదు.
చిరంజీవి నేరుగా జనసేనకు మద్దతు ప్రకటించలేదు. కానీ ఆయన తమ్ముడి వైపు కాకుండా ఇతర పార్టీ వైపు ఉంటారని ఎవరూ అనుకోరు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నానని ఆయన పదే పదే చెబుతున్నందున రాజకీయ పరమైన స్టేట్మెంట్ లు ఇచ్చే అవకాశం లేదు. అందుకే ఆయన తరపున నాగబాబు, పవన్ కల్యాణ్ మాట్లాడాతున్నారు. అయితే మెగాభిమానులు సీరియస్గా తీసుకోవడం లేదని అనుకుంటున్నారేమో కానీ అదే పనిగా ఒత్తిడి చేస్తున్నారు.