విరాటపర్వం ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకొంది. ఈదురు గాలలకు సభా ప్రాంగణంలోని ఎల్ ఈ డీ స్క్రీన్ ఒక్కసారిగా కుప్పకూలింది. దాంతో… ప్రేక్షకులు, చిత్రబృందం భయభ్రాంతులకు లోనైంది. ఆ సమయానికి స్టేజీపై ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
రానా, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం విరాటపర్వం. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కర్నూలులో నిర్వహించతలపెట్టారు. పోగ్రాం ప్రారంభమైన కాసేపటికే వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. ఇండోర్ స్టేడియం కావడంతో.. ఈదురు గాలుల తాకిడికి ఎల్ ఈ డీ స్క్కీన్ కిందకు పడిపోయింది. అదృష్టవశాత్తూ స్టేజీ వెనుక ఎవరూ లేకపోవడంతో.. అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. స్టేడియంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆ గందరగోళం మరింత పెరిగింది. స్క్రీన్ కూలిపోయిన వెంటనే ఈ కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులు అరుపులూ, కేకలతో స్టేడియం బయటకు పరుగులు తీశారు. చిత్ర బృందం కూడా హుటాహుటీన సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోయారు. ఈ పోగ్రాం జరుగుతుందా, లేదా? అనేది అనుమానంగా మారిందిప్పుడు.