రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘విరాటపర్వం’1990లో సరళ అనే అమ్మాయి నిజ జీవితంలో జరిగిన యధార్ధ సంఘటనలు ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా గురించి సరళ సోదరుడు తూము మోహన్ మాట్లాడారు. మా చెల్లి విప్లవాన్ని ప్రేమించింది. తను స్టూడెంట్ ఆర్గనై జేషన్ లోకి వెళ్లడం మేము వారించడం జరిగేది. కానీ తను నక్సల్ లోకి వెళ్ళిపోతుందని మేము అనుకోలేదు. దాన్ని ప్రేమించి, ఇష్టంతో వెళ్ళింది. సినిమాలో రవన్న రచనలకు ప్రభావతమై వెళ్ళినట్లు చూపించారు. రెండూ ఒక్కటే. ఆమె విప్లవాన్ని ప్రేమించింది. విప్లవం వలనే చనిపోయింది. ఇందులో ఎవరనీ తప్పుపట్టడం లేదు” అన్నారు
”మా కుటుంబం అంతా కలసి సినిమా చూశాం. సాయి పల్లవి, రానా లేకపోతే ఈ సినిమా లేదు. మాకు తెలిసిన కథలో రవన్న పాత్ర నెగిటివ్. తన వల్ల మా చెల్లి చనిపోయింది కాబట్టి మాకు కోపం వుండేది. కానీ రానా, సాయి పల్లవిని దర్శకుడు చూపించిన విధానం అద్భుతంగా వుంది. సురేష్ ప్రొడక్షన్ లాంటి బ్యానర్ లో ఇలాంటి కథని తీసుకొని ఒక ప్రయోగం చేయడమనేది చాలా గొప్ప విషయం. వారికి అభినందనలు” తెలిపారు మోహన్ రావు.