2018 అసెంబ్లీ ఎన్నికల ముందు, తర్వాత కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి.. టీఆర్ఎస్ కండువా కప్పుకొన్న నేతలు తాజాగా సొంతగూటికి వెళ్లడానికి ముహుర్తం పెట్టుకుంటున్నారు. ఈ చేరికలు వరుసగా ప్రారంభమయ్యాయి. ముందు ఎమ్మెల్యేలు కూడా ఉంటారన్న చర్చ జరుగుతోంది. హైదరాబాద్ శివారులోని బడంగ్‌పేట నగర పాలక సంస్థ మేయర్ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లుగా ప్రకటించారు. ఓ మేయర్ పార్టీ మారడం అంటే టీఆర్ఎస్కు ఊహించంని షాకే. ఆరుగురు కార్పొరేటర్లతో కలిసి మేయర్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. మంత్రి సబిత వారిని ఆపేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.
తీగల కృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరంతా రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు కూడా వెనక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎంపీగా తన విజయంలో కీలక పాత్ర పోషించారని రేవంత్ రెడ్డి చెబుతూ ఉంటారు. అయితే తర్వాత ఆయన టీఆర్ఎస్లో చేరారు. ఆయనతోనూ చర్చలు పూర్తి చేశారు. ఒక వేళ ఎమ్మెల్యే రాకపోతే టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన నేతను చేర్చుకునేందుకు రేవంత్ రంగం సిద్ధం చేశారు.
ఇక అనేక మంది పాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రేవంత్ టచ్‌లోకి వెళ్లారు. జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు అనువైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా వరుసగా చేరికలపై రేవంత్ దృష్టి పెట్టారు అయితే ఎవరూ బీజేపీ వైపు చూడాలనుకోవడం లేదు. బలమైన నాయకుడిగా రేవంత్ రెడ్డి ఉండటంతో కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. ఇది ఆ పార్టీకి మరింత ఊపునిస్తోంది.