పోలవరం ముంపు మండలాల చుట్టూ తెలుగు రాష్ట్రాల రాజకీయం నడిచే అవకాశం కనిపిస్తోంది. పోలవరం ముంపు వస్తుందన్న కారణంగానే ఆ మండలాలను ఏపీలో కలిపారు. అయితే ఇటీవల వరదలకు ఆ మండలాల్లో ప్రజలకు కనీస సౌకర్యాలు అందలేదు. ఏపీ ప్రభుత్వం… పట్టిచుకోలేదు. వరద సాయం మాటలకే పరిమితమైంది. కనీస సమాచారం ఇచ్చే అధికారులు కూడా లేకుండా పోయారు. అయితే తెలంగాణ వైపు నుంచి కాస్త సాయం సరిహద్దు గ్రామాలకు అందింది. ఇది అక్కడి ప్రజలకు కూడా కాస్త ఊరటనిచ్చింది.
ఇదే అదనుగా పోలవరం ముంపు మండలాలను మళ్లీ తెలంగాణలో కలపాలన్న డిమాండ్‌న వినిపించడం ప్రారంభించారు. అక్కడి ప్రజలతో అనిపిస్తున్నారు. తమను తెలంగాణలో కలపాలన్న డిమాండ్‌తో ప్రదర్శనలు చేయిస్తున్నారు. పువ్వాడ అజయ్ మొదట ఐదు గ్రామాల గురించి మాత్రమే మాట్లాడినప్పటికీ ఇప్పుడు టీఆర్ఎస్ మొత్తం ఏడు మండలాల గురించి మాట్లాడుతోంది. రజత్ కుమార్ వంటి అధికారుల్ని రంగంలోకి దింపి అసలు పోలవరం వల్ల తెలంగాణ మునిగిపోతుందన్నట్లుగా మాట్లాడిస్తున్నారు.
తెలంగాణ పోలవరం ముంపు మండలాలపై చేస్తున్న రాజకీయానికి వైసీపీ నుంచి అనుకున్న స్థాయిలోనే కౌంటర్ వస్తోంది. పోలవరం నిర్మించలేక వివాదాల్లోకి నెట్టి.. సెంటిమెంట్ పెంచేసుకుని రాజకీయ లబ్ది కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నా పట్టించుకోవడం లేదు. అనుకున్నవిధంగా పోలవరం ముంపు మండలాలపై వైసీపీ నేతలు భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారు. తాము అక్కడి ప్రజల్ని ఆదుకుంటామని చెబుతున్నారు.
ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉన్న ఈ విలీన మండలాల రాజకీయం ముందు ముందు మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ అనుకూల మీడియాలో ఈ అంశంపై రెండు రాష్ట్రాలు.. ఒకరినొకరు రెచ్చగొట్టుకునేలా చర్చా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాయి. దీంతో చాలా మందికి ఇదో పొలిటికల్ ట్రాప్ అన్న అభిప్రాయం కలుగుతోంది .