కాళేశ్వరం ప్రాజెక్ట్ మునిగిపోవడం ఇప్పుడు తెలంగాణలో రాజకీయ దుమారానికి కారణం అవుతోంది. రూ.వేల కోట్లతో కట్టిన కన్నెపల్లి బాహుబలి పంప్‌హౌస్‌లు ఎంత వరద వచ్చినా మునిగిపోవని చెబుతూ వచ్చారు. కానీ మునిగిపోయాయి. దీనికి కారణంగా భారీగా వరద రావడం కాదు.. 17 బాహుమబలి మోటార్లకు రక్షణగా సిమెంట్ తో కట్టిన ఫోర్ బేస్ మెంట్ గోడ కూలిపోవడం. అలాగే పంప్‌హౌస్ హెడ్ రెగ్యులేటర్ గేట్లు కూడా పగిలిపోయాయని ప్రచారం జరుుతోంది.
పంప్‌హౌస్‌లలో నీటిని తోడేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిచండం లేదు. ఇంకా రెండుమూడు రోజులు పడుతుందని అంటున్నారు. ఇంకా మోటార్లు నీళ్లోలనే ఉన్నాయి. కన్నెపల్లిలో మాత్రం ఇప్పటి వరకు నీళ్ల తొలగింపు మొదలు కాలేదు. గోదావరిలో వరద తగ్గుముఖం పట్టాలని, కరెంట్ లేదని, జనరేటర్లు తెప్పిస్తున్నామని… ఇలా అధికారులు రోజుకో కారణం చెబుతున్నారు . నిజానికి పంప్‌హౌస్, ఫోర్ బేలోని నీళ్లను తోడేయడం మేఘా లాంటి కాంట్రాక్టు సంస్థకు పెద్ద పనేమీ కాదు. కరెంట్ ఉన్నా లేకపోయినా జనరేటర్ల సహాయంతో 100, 200 హెచ్‌పీ మోటార్లను పెట్టి నీళ్లను తోడేయొచ్చు.
కానీ పని మాత్రం చేయడం లేదు. ఆ పని చేస్తే మొత్తం లోపాలు బయటపడతాయన్న వాదన వినిపిస్తోంది. పగిలిపోయిన గేట్లను సరి చేయకుండా నీళ్లను తోడడానికి మోటార్లను అమర్చితే.. ఎన్ని రోజులు డీవాటరింగ్ చేసినా గోదావరి నుంచి నీళ్లు వస్తూనే ఉంటాయని అందుకే మేఘా పట్టించుకోవడం లేదని అంటున్నారు. మొత్తానికి లక్ష కోట్లతో నిర్మించిన పోలవరంలో ఘేఘా వాటానే ఎక్కువ. బయటపడితే.. మొత్తం వ్యవహారం సంచలనాత్మకం అవుతుంది.