హైకోర్టు తీర్పును కూడా ధిక్కరించి పనులు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న ఏపీ ప్రభుత్వంపై రాజధాని రైతులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని.. ప్రభుత్వ తీరు వల్ల.. ధిక్కరణ తీరు వల్ల కొన్ని వందల కోట్ల సంపద నాశనం అవుతోందని వారు ప్రధానంగా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ విషయాలనే ప్రధానంగా పిటిషన్లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. రైతులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఎప్పుడు జరుగుతుందో స్పష్టత రావాల్సి ఉంది.
ఏపీ రాజధానికి నష్టపరిహారం తీసుకోకుండా భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం పలు హామీలతో అగ్రిమెంట్ చేసుకుంది. దాని ప్రకారం చేయాల్సిన పనులన్నింటినీ చేయలేదు. సరి కదా గత మూడేళ్ల నుంచి రాజధానిని అనాథలా వదిలేశారు. పనులు ఆపేశారు. అదే సమయమంలో రాజధాని తరలింపునకు ఏర్పాట్లు చేశారు. కానీ రైతులు ప్రత్యక్ష పోరాటం చేశారు న్యాయపోరాటం చేసి..అమరావతిని నిర్మించాల్సిందేనన్న వాదన నెగ్గించుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం తాము మూడు రాజధానులకే కట్టుబడ్డమని చెబుతూ పనులు మాత్రం చేయడం లేదు.
రాజధానిలో రోడ్లను తవ్వేస్తున్నారు. ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. కానీ ప్రభుత్వం మాత్రం అలా అయిపోవడమే మంచిదన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇలాంటి పరిణామాలతో రైతులు విసుగు చెంది.. పనులు చేసేలా ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టు మెట్లెక్కారు.