అన్ని చోట్లా లేని అధికారాల్ని లాక్కోవడం బీజేపీ స్టైల్. ఈశాన్య రాష్ట్రాల దగ్గర్నుంచి మహారాష్ట్ర వరకూ జరిగింది అదే. గతంలో బీహార్‌లోనూ కలిసి ఎన్నికల్లో పోటీ చేసి.. ప్రభుత్వం నడుపుతున్న లాలూ ఆర్జేడీ – నితీష్ జేడీయూలను చీల్చి.. అర్జంట్‌గా లాలూను జైలుకుపంపి.. ప్రభుత్వంలో డిప్యూటీలుగా ఉన్న ఆయన కుమారులపై అవినీతి ఆరోపణలు చేసి.. వాళ్లను బయటకు పంపేసి.. నితీష్ తో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు బీజేపీకి అదే సీన్ రిపీటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
బీజేపీని గెంటేసి.. ఆర్జేడీతో కలిసి నితీష్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ చర్చల దశకు వచ్చాయి. దాదాపుగా పూర్తయ్యాయి. మంగళవారం అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. గత ఎన్నికల్లో నితీష్ కుమార్ పార్టీ దారుణంగా దెబ్బతిన్నది. అయినప్పటికీ బీజేపీ ఆయనకు ముఖ్య మంత్రి పదవి ఇచ్చింది. కానీ మెజార్టీ స్థానాలు బీజేపీ దగ్గర ఉన్నాయి.దీంతో ఆయన చేయడానికి ఏమీ లేకుండా పోతోంది. దీంతో ఆర్జేడీని ప్రభుత్వంలోకీ తీసుకుని.. బీజేపీని పంపేయాలని అనుకుంటున్నారు. ఆర్జేడీకి ప్రభుత్వ ఏర్పాటుకు చాలాకొద్ది స్థానాలే తగ్గాయి.
కాంగ్రెస్ కూడా ఈ మార్పు పట్ల సానుకూలంగా ఉంది.గతంలో నితీష్ తమను డంప్ చేసి వెళ్లిపోయినా ఇప్పుడు తప్పు దిద్దుకునేందుకు ప్రభుత్వ ఏర్పాటుకు కలసి వస్తున్నందున వారుకూడా ఓకే అంటున్నారు. ఈ కారణంగా ఇప్పుడు బీజేపీ కీలక రాష్ట్రంలో అధికారం కోల్పోతోంది. ఎన్డీఏలో ఉన్న ఓ మాదిరి పార్టీ జేడీయూనే. ఇప్పుడు ఆ పార్టీ కూడా గుడ్ బై చెబుతోంది. ఇప్పటికే జేడీయూ బీజేపీతో అన్ని సంబంధాలు తెంచుకుంది. నీతి ఆయోగ్ భేటీకి కూడా నితీష్ వెళ్లలేదు. ప్రభుత్వ మార్పుపై మంగళవారం బీహార్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.