తెలంగాణ సీఎం కేసీఆర్ కుల, మత, ప్రాంతాల ఈక్వేషన్లు కాకుండా ఈ సారి కొత్తగా రైతు ఫార్ములాను ప్రయోగిస్తున్నారు. రెండు రోజుల పాటు ప్రగతి భవన్లో దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాల ప్రతినిధులోత మేథమథనం జరిపి.. రాజకీయం పోరాటాలు చేయాల్సిన అవసరాన్ని వారికి వివరించారు. ఇక మోదీని ఎుదర్కొనేలా రాజకీయం చేయాలని వారికి ఉద్భోదించారు. వారంతా చట్టసభల్లో ఉండాల్సిన అవసరం ఉందని .. కూడా ఉన్నారు. అంటే.. వారంతా రైతు ఉద్యమాలను రాజకీయాలను కలపాలని కేసీఆర్ … సూటిగా సలహా ఇచ్చేశారు. వారికి కూడా ఆ సలహాలు బాగా నచ్చాయని.. తమ తమ రాష్ట్రాల్లో కార్యాచరణ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని.. టీఆర్ఎస్ అనుబంధ మీడియా ప్రకటించింది.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతు పథకాలు అమలవుతున్నాయన్న ఓ ప్రచారాన్ని ఇప్పటికే కేసీఆర్ దేశవ్యాప్తంగా చేస్తున్నారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు ఉద్యమం చేస్తామని కేసీయార్ చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆ ఉద్యమానికి నేతృత్వం వహించేందుకా అన్నట్లుగా.. రైతు సంఘాలను కలుపుకుంటున్నారు. ఇప్పటికే ఓ సారి రైతు సమస్యలపై ఢిల్లీలో ధర్నా చేశారు కూడా. ముందు ముందు ఈ పోరాటాలు పెంచనున్నారు.
రైతు ఎజెండాతో ఓ భారీ బహిరంగసభను నిర్వహించాలని కేసీఆర్ ్నుకుంటున్నారు. మేలోనే మహబూబ్‌నగర్ లేదా కరీంనగర్లో భారీ బహిరంగ సభ పెట్టాలనుకున్నారు. కానీ వివిధ రకాల సమస్యలతో సాధ్యం కాలేదు. ఇప్పుడు ఎన్నికల వేడి పెరుగుతున్నందున ఇక ఆగకూడదని అనుకుంటున్నారు. రైతు సెంటిమెంట్‌ను పట్టిస్తే.. ఇక ఎదురే ఉండదని కేసీఆర్ గట్టి నమ్మకం . ఉత్తరాది రైతులు కేంద్రంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని కేసీఆర్ నమ్ముతున్నారు. సకల జనుల సమ్మె తరహాలో సకల రైతుల సమాహారంగా నిరసనలు, దీక్షలు, ధర్నాలు, ఆందోళనలు చేస్తే .. దానికి నాయకత్వం వహిస్తే.. జాతీయ స్థాయికి వెళ్లినట్లేనని కేసీఆర్ భావిస్తున్నారు.