సందీప్ కిషన్ కొత్త సినిమా ‘మైఖేల్’. విజయ్ సేతుపతి కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. రంజిత్ జయకోడి దర్శకత్వం. భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ నిర్మాతలు. పాన్ ఇండియా సినిమాగా ఐదు భాషల్లో ఈ సినిమా విడుదల రెడీ చేస్తున్నారు. తాజాగా టీజర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్లో మైఖేల్ గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు చెప్పాడు సందీప్.
”నాకు నేనుగా పెట్టుకున్న అతి పెద్ద పరీక్ష ‘మైఖేల్’. మూడేళ్ళ క్రితం నుండి ‘మైఖేల్’ కోసం వర్క్ స్టార్ట్ చేశాం. దర్శకుడు రంజిత్ జయకోడి నాకు యునీవర్స్ ఇచ్చిన గిఫ్ట్. ఈ సినిమా కోసం పడిన కష్టం మాటల్లో చెప్పలేను. 24 కిలోల బరువు తగ్గాను. విజయ్ సేతుపతి అన్నతో పని చేయడం గ్రేట్ ఫీలింగ్. తొమ్మిది రోజులు రాత్రిపగలు ఆయనతో షూటింగ్ చేశాం. ఒక్క క్షణం కూడా అలసట చెందలేదు. మైఖేల్ తో ఒక కొత్త ప్రయత్నం చేశాం. ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను” అని చెప్పుకొచ్చాడు సందీప్.