తనను బలహీనుడ్ని చేయడానికి సొంత పార్టీ నేతలే కాంగ్రె్స్ పార్టీని హత్య చేస్తున్నారని రేవంత్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. కేసీఆర్తో కలిసి సొంత పార్టీ నేతలు కలిసి.. కుట్రలు చేస్తున్నారని.. ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన ఒక్కసారి బరస్ట్ అయ్యారు. ఓ రకంగా రేవంత్ రెడ్డి నిస్సహాయంగా కనిపించారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా పూర్తి కాన్ఫిడెన్స్ తో కనిపించే రేవంత్ రెడ్డి ఇలా మీడియా ముందు ఒక్క సారిగా బరస్ట్ కావడం ఆయన అభిమానుల్లోనూ ఆవేదన నింపింది.
రేవంత్ పీసీసీ చీఫ్ అయినప్పటి నుండి… కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ వచ్చింది. కానీ కాంగ్రెస్ ఎక్కడ గెలుస్తుందో.. ఎక్కడ రేవంత్ సీఎం అయిపోతారోనన్న భయం.. ఆందోళన.. ఈర్ష్య లాంటివి కాంగ్రెస్ నేతల్లోనే ప్రారంభమయ్యాయి. బయట నుంచి వచ్చిన నేతను సీఎం చేస్తామా అంటూ పార్టీ నుంచి వెళ్లిపోయిన రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే చెప్పారు. ఆయన చేయడం ఏమిటో కానీ అందరూ కలిసి పని చేస్తేనే పార్టీ గెలుస్తుంది. హైకమాండ్ నిర్ణయించిన వ్యక్తి సీఎం అవుతారు. కానీ రేవంత్ కష్టం ఎక్కువగా ఉంది కాబట్టి… తాము పని చేయకూడదనుకున్నారు. అలా ఉన్నా పర్వాలేదు..కానీ ఉద్దేశపూర్వకంగా పార్టీని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారు.
కాంగ్రెస్ కంచుకోట.. సిట్టింగ్ స్థానం అయిన మునుగోడులో ఎన్నికలకు దగ్గర పడుతున్న కొద్దీ.. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఓట్లు పోలరైజ్ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి మరింత ఇబ్బందికరం. వచ్చే ఎన్నికల్లో అసలు రేసులో ఉన్నామని చెప్పుకోవడానికైనా మునుగోడులో గెలవాల్సి ఉంది.కానీ కోమటిరెడ్డితో పాటు సీనియర్లందరూ.. లైట్ తీసుకున్నారు. ఈ పరిణామాలోనే.. రేవంత్ రెడ్డి ఒక్క సారిగా బరస్ట్ అయ్యారని అంటున్నారు.