హైదరాబాద్: సీపీఐ నేత నారాయణ ఇవాళ రాజమండ్రిలో పుష్కరఘాట్ దుర్ఘటన బాధితులను పరామర్శించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలమధ్య సమన్వయలోపంవల్లే తొక్కిసలాట జరిగిందని అన్నారు. పరిపాలనానుభవం, అవగాహనలేని మంత్రికి ఇంత పెద్ద బాధ్యతలు అప్పగించటం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన తప్పంటూ పరోక్షంగా పురపాలకశాఖమంత్రి నారాయణనుకూడా తప్పుబట్టారు. పోయినవారికి పిండం పెట్టటంకాదు, బతికున్నవారికి తిండి పెట్టాలంటూ హిందూ సంప్రదాయాలనుకూడా నారాయణ విమర్శించారు. చంద్రబాబు రాజీనామా చేయాల్సిన అవసరంలేదని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై వివాదం చేయటం తగదని నాయకులకు సూచించారు. పుష్కరఘాట్వద్ద రెండువంతెనల మధ్య ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు.