తుమ్మల నాగేశ్వరరావుపై టీఆర్ఎస్ హైకమాండ్ నమ్మకం కోల్పోయినట్లుగా ఉంది. పార్టీ కార్యక్రమాలకు పెద్దగా ఆహ్వానం పలకడం లేదు. వరదలు వచ్చిపన్పుడు జిల్లాకు వచ్చిన కేసీఆర్.. తుమ్మలకు ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం జిల్లా నేతలెవరూ ఆయనను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆహ్వానించడం లేదు. ఇటీవల కేసీఆర్ వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరికి రాజ్యసభ సీటు ఇచ్చారు. వారిలో ఒకరు గాయత్రి రవి కాగా.. మరొకరు హెటిరో పార్థసారధిరెడ్డి.
వీరిద్దరూ తమకు లభించిన పదవుల కారణంగా… సన్మాన కార్యక్రమాన్ని భారీగాఏర్పాటు చేసుకున్నారు. జిల్లా టీఆర్ఎస్ నేతలందర్నీ పిలిచారు. కానీ తుమ్మలను మాత్రం దూరం పెట్టారు. దీంతో తుమ్మల నాగేశ్వరరావు ఫీలయ్యారు.పార్టీలోనే తనను అంటరాని వాడ్ని చేశారని అనుకుంటున్నారు. ఇటీవల తన రాజకీయ జీవితం నలభై ఏళ్లయిన సందర్భంగా తమ్ముల ఓ సమావేశం పెట్టారు. ఆ సందర్భంగా పార్టీ మారుతారేమోనన్న ప్రచారం జరిగింది. కానీ తుమ్మల మాత్రం తాను టీఆర్ఎస్లో ఉంటానని తేల్చి చెప్పారు.
తుమ్మల నాగేశ్వరరావు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్న లక్ష్యంగా ఉన్నారు. టీఆర్ఎస్లో సీటు దక్కడం గగనంగా మారింది. సిట్టింగ్‌లకే టిక్కెట్లు ఇస్తామని చెప్పడంతో పాలేరులో ఆయనకు సీటు రాదని క్లారిటీ వచ్చింది. కమ్యూనిస్టులకు కూడా ఖమ్మంలో ఈ సారి టిక్కెట్లివ్వాలి కాబట్టి ఇతర నియోజకవర్గాల్లో చాన్స్ దొరకదు. పార్లమెంట్ నియోజకవర్గానికీ ఇవ్వరు. ఎలా చూసినా తమ్మలకు టిక్కెట్ రాదు. అదే సమయంలో ఆయనను దూరం పెడుతున్నారు. తుమ్మల ఎటు వైపు చూస్తారో కానీ .. ఆయన టీఆర్ఎస్లో ఉంటానన్నా.. పార్టీ నేతలుఉండనిచ్చేలా లేరన్న వాదన వినిపిపిస్తోంది.