జాకీ అనే అంతర్జాతీయ ఇన్నర్ వేర్ బ్రాండ్ గురించి తెలియని వారు ఉండరు. ఆ సంస్థ గతంలో బెంగుళూరులో ప్లాంట్ పెట్టాలనుకుంది. చంద్రబాబునాయుడు, లోకేష్ ఈ విషయం తెలుసుకుని బెంగళూరులో ఎందుకు.. బెంగళూరుకు దగ్గరగా ఉంటుంది.. రాప్తాడులో పెట్టండి.. అని పలు రాయితీలు ఆఫర్ ఇచ్చారు. ఇదేదో బాగుందనుకుని రాప్తాడులో పెట్టాలని జాకీ నిర్ణయించుకుంది. దీంతో కొన్ని వందల మంది రాప్తాడు యువత, మహిళలకు ఉద్యోగాలు వస్తాయని సంబరపడ్డారు. ఆ సంస్థ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభించింది.
పరిశ్రమల్ని వెళ్లగొట్టే దరిద్రం ఏపీలో తప్పా ఎక్కడా ఉండదు !
కానీ ఎన్నికలు వచ్చాయి. పరిటాల సునీత ఉడిపోయారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. వెంటనే జాకీ కంపెనీ చేయిస్తున్న పనులు నిలిపివేశారు. రూ. పదిహేను కోట్లు కప్పం కట్టాల్సిందేనన్నారు. ఎందుకంటే.. తనకు ఎన్నికల్లో ఖర్చయ్యాయన్నారట. దీన్ని సీఎం స్థాయి వరకూ జాకీ ప్రతినిధులు తీసుకెళ్లారు. అదేదో సినిమాలో ప్రకాష్ రాజ్ చెప్పినట్లు.. పాపం ఇచ్చేయండన్న సంకేతాలు పై నుంచి రావడంతో.. జాకీ ప్రతినిధులు హర్టయ్యారు. మీకో దండం అని లెటర్ రాసి తెలంగాణకు వెళ్లిపోయారు. అక్కడ కేటీఆర్ రెడ్ కార్పెట్ పెట్టి ఆహ్వానించి ఎక్కడెక్కడ భూమి కావాలో అడిగి మరీ కేటాయించారు.
లంచం ఇవ్వలేరా అని నేరుగా అడుగుతున్న ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి !
అంత విలువైన భూమి ఇస్తే రూ. పదిహేను కోట్ల లంచం ఇవ్వరా అని నేరుగా అడుగుతున్నాడు.. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. జాకీ పోతే పోయింది.. దాని కంటే పెద్ద కంపెనీలను తెచ్చి యువతకు ఉపాధి కల్పిస్తామని గప్పాలు కొడుతున్నారు. వచ్చిన పరిశ్రమ.. ప్లాంట్ నిర్మాణాలు ప్రారంభించిన పరిశ్రమను బెదిరించి పంపేసిన వైసీపీ ఎమ్మెల్యే.. ఇప్పుడు ఇష్టం వచ్చినట్లుగా ఆ కంపెనీపై నోరు పారేసుకుంటున్నారు.
కర్నూలు హైకోర్టు వల్ల వచ్చే జిరాక్స్ షాపుల్లో కొన్ని అనంతపురానికి కేటాయించి యువతకు న్యాయం చేస్తారా ?
కొద్ది రోజులుగా సీమ యువతకు న్యాయంపై వైసీపీ నేతలు అనర్ఘళంగా ప్రసంగిస్తున్నారు. ఈ న్యాయాన్ని ఇప్పటికే వైసీపీ నేతలు చేసేశారు. జాకీ అధికారికంగా వెళ్లిపోయింది.. కానీ .. కనీసం ఓ ఇరవై పరిశ్రమలు.. అనంతపురంలో అడుగుపెట్టకుండానే ఆగిపోయాయని అందరికీ తెలుసు. కియా లాంటి పరిస్రమ వస్తే.. అనంతపురంమొత్తం ఆటో హబ్ చేసుకోవడానికి చాన్స్ వచ్చినట్లే. కానీై నేలపాలు చేసేశారు. యువతకు తమ మార్క్ న్యాయం చేశారు. బహుశా.. కర్నూలులో పెట్టే హైకోర్టు వల్ల.. వచ్చే అనుబంధ వ్యాపారాలు అంటే టీ దుకాణాలు.. జిరాక్స్ షాపులను.. అనంతపురానికి వైసీపీ సర్కార్ కేటాయిస్తుందేమో చూడాలి.