`ఈనాడు` ఓ మహా వృక్షమైతే… అందులోంచి చాలా ఉప శాఖలు పుట్టుకొచ్చాయి. సితార, విపుల, చతుర, అన్నదాత, తెలుగు వెలుగు… పత్రికలు `ఈనాడు` గొడుకు కింద పెరిగి, పెద్దవైనవే. అయితే… విపుల, చతుల, సితారలను మూసేసిన రామోజీ రావు.. ఆ తరవాత ఎంతో ఇష్టపడి ప్రారంభించిన తెలుగు వెలుగు పత్రికనూ ఆపేశారు. దానికి కారణం… పాఠకులు కరువవ్వడం, పేపర్ కాస్ట్ పెరిగిపోవడమే. ఇప్పుడు అన్నదాత పత్రికనీ నిలిపి వేయాలన్న నిర్ణయం తీసుకొన్నారు. ఎన్నో ఏళ్లుగా రైతులకు ఉపకారిగా ఉన్న అన్నదాత ఇక కనిపించదు. నిజానికి సితార, విపుల చతుర, తెలుగు వెలుగు..ఇవన్నీ నష్టాల్లో ముగిశాయి. అన్నదాత లాభాలను తెచ్చి పెట్టేది. అయినా సరే, ఇప్పుడు అన్నదాతని మూసేస్తున్నారు. ఈనెలతో అన్నదాత ఇక కనిపించదు. అందులోని ఉద్యోగులకు వాలెంటరీ రిటైర్మెంట్ ఇవ్వాలని సంస్థ భావిస్తోంది. అయితే.. ఉద్యోగులు మాత్రం ఈనాడులోనే వేరేశాఖల్లో సర్దుబాటు చేయండని యాజమాన్యాన్నికోరుతున్నారు. రామోజీకి అన్నదాత చాలా ఇష్టమైన పత్రిక. రైతు రంగానికి ఈ పత్రికతో సేవ చేయాలనుకొన్నారు. దాంతో లాభాలనూ ఆర్జించారు. కానీ సడన్గా అన్నదాతని మూసేయాలన్న నిర్ణయం ఎందుకు తీసుకొన్నారో అర్థం కావడం లేదు. మొత్తానికి ఇప్పుడు ఈనాడు ఒక్కటే మిగిలింది. దాని ఉప పత్రికల చరిత్ర మొత్తం ముగిసినట్టే.