వివేకా హత్య కేసులో తెలంగాణలో విచారణ జరగడం ఇంకా మంచిదని సజ్జల రామకృష్ణారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీలో విచారణ జరగడం కన్నా.. అక్కడ జరిగితేనే తమకు మేలు జరుగుతుందన్న సంతృప్తి ఆయనలో కనిపించింది. అది నమ్మకమా లేకపోతే… సొంత బాబాయ్ హత్య కేసులోనూ నిందితుల్ని పట్టుకోడం చేత కాక.. నిందితుల్ని కాపాడుతున్నారని సుప్రీంకోర్టు తేల్చి.. ఇతర ప్రాంతాలకు విచారణ తరలించడాన్ని కవర్ చేసుకోవడానికి అలా మాట్లాడారా అన్నదానిపై క్లారిటీ లేదు.
వివేకానందరెడ్డి వైసీపీ నాయకుడని.. జగన్‌కు చిన్నాన్న అని సజ్జల చెప్పుకొచ్చారు. ఈ కేసులో రాజకీయాలు ఉండవి.. కానీ టీడీపీనే వివేకా కుటుంబసభ్యులతో కలిసి కుట్ర చేస్తోందని చెప్పుకొచ్చారు. అంతిమంగా నిజాలు తెలియాలని… దోషులకు శిక్ష పడాలని చెప్పుకొచ్చారు. తెలంగాణలో విచారణ జరుగుతుందని.. తమకు దాపరికాలు.. భయాలు లేవన్నారు. వివేకా హత్య కేసు విషయంలో సజ్జల గతంలో దారుణమైన వ్యాఖ్యలు చేశారు. వివేకా కుమార్తె,అల్లుడిపైనే ఆరోపణలు చేస్తూ.. ఎదురు దాడి ఆయనే ప్రారంభించారు. తర్వాత అందరూ అందుకున్నారు. అదే విషయాలతో నిందితుడు శివంకర్ రెడ్డి భార్య పులివెందుల కోర్టులో పిటిషన్ వేసింది.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్‌పై వైఎస్ సునీత పోటీ చేస్తుందని.. టిక్కెట్ కోసమే ఇలా చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సొంత తమ్ముడు.. జగన్ బాబాయ్ హత్యకు గురైతే.. ఆయన పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తూంటే… వారిపైనే రివర్స్ ఆరోపణలు చేయడం కాకుండా.. ఇప్పుడు విచారణను ఇతర రాష్ట్రాలకు మారిస్తే.. మాకే మంచిదని కామెంట్లు చేస్తున్నారు సజ్జల.