వైసీపీ ప్రభుత్వం రెడ్లకు సామాజిక న్యాయం చేయడానికి అందరికీ అన్యాయం చేస్తోంది. ప్రభుత్వం లో టాప్ ఫోర్ని చూస్తే తెలిసిపోతుంది. ఇక కింది స్థాయిలో ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం. దానికి తాజా ఉదాహరణ.. ఏపీ పంచాయతీరాజ్ ఈఎన్సీ పోస్టు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక…ఆ పోస్టులో అర్హత లేని ఓ కడప రెడ్డిగారిని నియమించారు. నిజానికి ఆ పోస్టు సీనియార్టీలో ఆ రెడ్డి గారి కంటే ఎంతో ముందున్న బలహీనవర్గాలకు చెందిన అధికారులకు దక్కాలి. కానీ ప్రశ్నిస్తే ప్రభుత్వం ఎక్కడ కక్ష సాధిస్తుందోనని వారు సైలెంట్ అయ్యారు.
ఆ కడప రెడ్డిగారు.. రిటైరైనా రెండు దఫాలుగా పొడిగింపు పొందారు. ఇప్పుడు రిటైరయ్యారు. ఆయన పోస్ట్ బాలునాయక్ అనే ఎస్టీ అధికారికి రావాలని కానీ.. ఆయన కంటే జూనియర్ అయిన సుబ్బారెడ్డి అనే రెడ్డి గారు ఉత్తర్వులు తెచ్చేసుకున్నారు. బాధ్యతలు చేపట్టారు. ఆ జీవోను ప్రభుత్వం రహస్యంగానే ఉంచింది. దీంతో బాలునాయక్ .. పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఆయన గిరిజన వర్గానికి చెంది ఉండవచ్చుకానీ.. అసమర్థుడు కాదని.. రెడ్లకే సమర్థత ఉంటుందా అన్న చర్చ పంచాయతీరాజ్ శాఖలో జరుగుతోంది.
ఒక్క పంచాయతీ రాజ్ శాఖ మాత్రమే కాదు.. వైసీపీ ప్రభుత్వంలో ప్రతీ శాఖలోనూ ఇదే తంతు. అర్హత.. అనుభవం లేకపోయినా.. ఓ సామాజికవర్గానికే పెద్ద పీట వేస్తున్నారు. సమర్థత ఉన్నా. .. ఎస్సీ, ఎస్టీ, బీ సీ వర్గాల అధికారులను పక్కన పెట్టేస్తున్నారు. ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వంతో కలిసిపోయి… ఇలాంటి వాటిని పట్టించుకోవడం మానేశారు . బలహీనవర్గాల ఉద్యోగులు … ఈ వేదనను గత మూడున్నరేళ్లుగా అనుభవిస్తూనే ఉన్నారు. ఓ పద్దతిలేని పాలనలో తాము అన్యాయమైపోతున్నామని ఆవేదన చెందుతూనే ఉన్నారు.