బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ తో పాటు తమిళ్ డబ్బింగ్ సినిమాలు విజయ్ ‘వారసుడు’, అజిత్ ‘తునివు’ సంక్రాంతి బరిలో దిగుతున్నాయి. అయితే సంక్రాంతి కి డబ్బింగ్ సినిమాలకు కాకుండా తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఒక వివాదం కూడా నడిచింది. తాజాగా సురేష్ బాబు దీనిపై స్పందించారు.
”ఎవరి సినిమాని ఆపలేం. అన్ని సినిమాలు విడుదల కావాలి. అందరికీ థియేటర్స్ ఇవ్వాలి. అందరూ విడుదల చేసుకోవాలి. బెటర్ సినిమాకి బెటర్ థియేటర్లు దొరికుతాయి తప్పితే ఒకరిని ఆపే ప్రసక్తే వుండదు. కంటెంట్ వున్న సినిమానే ఫైనల్ గా ఆడుతుంది. కాంతార సినిమాని చిన్న సినిమాగా ఇక్కడ విడుదల చేశారు. ఎంతపెద్ద సంచలనం సృష్టించిందో తెలిసిందే. ప్రేక్షకుల్లో చాలా తెలివైన వాళ్ళు. బావున్న కంటెంట్ ని ఎక్కడున్నా చూస్తారు” అని చెప్పుకొచ్చారు.