సినిమా చూపిస్తా మావా, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ. ఇప్పుడు రవితేజ ధమాకా సినిమాకి కూడా ఆయనే రైటర్. త్వరలోనే ఆయన మెగా ఫోన్ కూడా పడుతున్నాడు. నాగర్జున కు ఓ కథ చెప్పాడు ప్రసన్న. ఇది నాగ్ కి చాలా నచ్చింది. దర్శకత్వ భాద్యత కూడా ప్రసన్నకే అప్పగించారు నాగార్జున.
అయితే ఈ సినిమా పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఉంటుందని, అలాగే ఇది ఒక హిందీ సినిమాకి రిమేక్ అని వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా ప్రసన్న క్లారిటీ ఇచ్చాడు. ”నాగార్జున గారితో చేస్తున్న సినిమా రీమేక్ కాదు. నా సొంత కథే. అయితే ఈ కథ రంగ్ దే బసంతి స్టయిల్ లో పీరియాడిక్ డ్రామాగా ఉంటుందని సరదాగా మాటల్లో ఎక్కడో చెప్పా. దీంతో అందరూ ఆ సినిమాకి రిమేక్ అని రాసేశారు. ప్రస్తుతం కథ పై వర్క్ చేస్తున్నా. త్వరలోనే ప్రకటన వుంటుంది” అని క్లారిటీ ఇచ్చారు ప్రసన్న.