ఆర్.ఆర్.ఆర్కు ఆస్కార్ అందించడం కోసం ఎస్.ఎస్.రాజమౌళి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయ వేదికలపై ఈ చిత్రానికి ప్రశంసలు దక్కుతున్నాయి. కొన్ని ప్రతిష్టాత్మక అవార్డుల కోసం.. ఆర్.ఆర్.ఆర్ పోటీలోనూ నిలిచింది. ఇప్పుడు ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు కోసం ఆర్.ఆర్.ఆర్ రెండు విభాగాల్లో నామినేట్ అయ్యింది. ఉత్తమ విదేశీ చిత్రం, బెస్ట్ వర్జినల్ సాంగ్ కేటగిరీల్లో అవార్డు కోసం ఆర్.ఆర్.ఆర్ పోటీ పడబోతోంది. ఈ అవార్డు కోసం భారతదేశం నుంచి చాలా చిత్రాలు పోటీకెళ్లాయి. కానీ… తుది ప్రదర్శనకు ఆర్.ఆర్.ఆర్ మాత్రమే నోచుకొంది. బెస్ట్ ఫిల్మ్ (నాన్ ఇంగ్లీష్) కేటగిరీలో ఆర్.ఆర్.ఆర్ తో పాటుగా మరో నాలుగు విదేశీ చిత్రాలూ పోటీ పడబోతున్నాయి. మరి మన ఆర్.ఆర్.ఆర్కి అవార్డు వస్తుందా? రాదా? అనే విషయం తెలియాలంటే జనవరి వరకూ ఆగాలి. గోల్డెన్ గ్లోబ్లో నామినేషన్ పొందిన తొలి తెలుగు చిత్రంగా `ఆర్.ఆర్.ఆర్` నిలిచింది. అవార్డు సాధిస్తే…. గోల్డెన్ గ్లోబ్ పొందిన తొలి భారతీయ చిత్రంగా రికార్డు సృష్టిస్తుంది.