తెలంగాణలో చంద్రబాబు ఘనంగా రీ ఎంట్రీ ఇవ్వడానికి కేసీఆరే కారణమని.. ఇప్పటి వరకూ చంద్రబాబును కేసీఆర్ ఆడుకున్నారని.. ఇక నుంచి కేసీఆర్ ను చంద్రబాబు ఆడుకుంటారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణ పేరును తన పార్టీలో నుంచి తీసేసి కేసీఆర్… భయంకరమైన తప్పు చేశారని ఆయన చెబుతున్నారు. టీఆర్ఎస్ ను తీసేసి బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంటర్ అవడానికి ప్రయత్నిస్తున్నారని, వారు ఇక్కడ బలపడేందుకు ఎందుకు ప్రయత్నించరని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
కేసీఆర్ ఏపీలో అట్రాక్ట్ చేయలేరు.. కానీ బాబు తెలంగాణను అట్రాక్ట్ చేయగలరని జోస్యం చెబుతున్నారు. టీడీపీ ఇప్పుడు మంచి ఎంట్రీ దొరికిందని, చంద్ర బాబు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొంటాడని జగ్గారెడ్డి అన్నారు. బాబు ఈ అవకాశాన్ని వదులుకొడని, బాబు మీద ఎంత మంది మంత్రులు మొత్తుకున్నా లాభం లేదని జగ్గారెడ్డి తెలిపారు. తెలంగాణ వాదాన్ని ముఖ్యమంత్రి చంపేశారని, రాజకీయ బ్రతుకునిచ్చిన చెట్టునే కేసీఆర్ నరికేసుకున్నారని.. తెలంగాణలో ఇక సీరియస్ పాలిటిక్స్ నడుస్తాయని జగ్గారెడ్ది చెప్పుకొస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకకు బిఆర్ఎస్ వెళితే టీడీపీ కూడా వెళుతుందన్నారు.
భవిష్యత్లో కాంగ్రెస్, టీడీపీ , బీఅర్ఎస్ కలిసిన కలవచ్చని జగ్గారెడ్డి అంచనా వేశారు. షర్మిల ప్రభావం కొంత ఉండొచ్చు… బీఎస్పీ ప్రభావం కూడా ఉంటుందని అన్నారు. జాతీయ పార్టీగా టీఆర్ఎస్ ను మార్చుకుని.. బీఆర్ఎస్ అని పేరుమార్చుకుని ఇప్పుడు సెంటిమెంట్ రేప్ ప్రయత్నాలు చేస్తే… అది బీఆర్ఎస్ కే రివర్స్ అవుతోంది. జగ్గారెడ్డి అదే చెప్పారు. ముందు ముందు టీడీపీ.. తెలంగాణలో కీలకమవుతుందని ఎక్కువ మంది రాజకీయ నేతలుర నమ్మేమాట. జగ్గారెడ్డి లాంటి కొంత మంది బహిరంగంగా చెబుతున్నారు.