పెన్షన్లు తీసేస్తున్నారని వృద్దులు గగ్గోలు పెడుతూంటే.. సీఎం జగన్ మాత్రం తాపీగా స్పందిస్తున్నారు. అలాంటి ప్రచారాలు చేసే వారిని గట్టిగా తిట్టాలని కూడా ఆయన సలహా ఇస్తున్నారు. ఇలాంటి సలహాలు ఆయన పార్టీ నేతలకు ఎప్పుడో ఇచ్చారు. ఇప్పుడు ఆయన అధికారులకు ఇలాంటి సలహాలిస్తున్నారు. పెన్షన్లు తీసేస్తున్నారని.. కొద్ది రోజులుగా పేదలు గగ్గోలు పెడుతున్నారు. మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే ఈ రోజు …ఓ పథకం మీట నొక్కే కార్యక్రమంలో మాట్లాడిన జగన్ మాత్రం అవన్నీ అావాస్తవాలని తేలికగా తీసుకున్నారు.
మనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని.. అయితే వాటిని సానుకూంగా తీసుకుని.. పరిశీలించారని.. అర్హులయితే వెంటనే పించన్ కొనసాగించాలని లేపోతే మాత్రం ప్రెస్ మీట్ పెట్టి తిట్టాలన్నారు. అలా చేస్తేనే తప్పుడు వార్తలు ఆగుతాయని సలహా ఇచ్చారు. ఇంత కాలం ఇచ్చిన పెన్షన్లు లక్షల్లో రాత్రికి రాత్రి తీసేయడం దేనికి.. రాత్రంతా వారికి వారు ఎలా ధనవంతులయ్యారన్నదానిపై మాత్రం జగన్ వివరణ ఇవ్వలేదు కానీ.. అర్హుల్ అనే పదంతో మొత్తం చేయాలనుకున్నది చేసేస్తున్నారు. అర్హతలు పరిశీలిస్తున్నామని సమర్థించుకుంటున్నారు.
తాజాగా ఆయన అధికారుల్ని కూడా ప్రతిపక్ష నేతలు, మీడియాపై తిట్టాలని నేరుగా సూచించడం వివాదాస్పదమవుతోంది. తిట్టడం అంటే విమర్శించడం అని వైసీపీ నేతలు సమర్థించుకోవచ్చు కానీ.. తిట్టడం అంటే.. తిట్టుడేనని వైసీపీలో ఉన్న నేతల భాష చూస్తే ఎవరికైనా అర్థం అయిపోతుంది. వచ్చే నెల నుంచి పెన్షన్ రూ. 250 పెంచుతూ.. దానికి తగ్గట్లుగా లబ్దిదారులను తగ్గిస్తున్నారన్న విమర్శలకు.. ఎదురు తిట్లే సమాధానం అన్నట్లుగా మారిపోయింది.