ఆయన పేరు లక్ష్మణరెడ్డి. ఏపీలో జన విజ్ఞాన వేదిక అని పెట్టి.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఊరూవాడా తిరిగి చేయాల్సినంత ప్రచారం చేశారు. ఆయనతో పాటు చాలా మంది ఆ పని చేశారు. ఇలా చేసిన వారందరికీ జగన్ పదవులు ఇచ్చారు. ఈ లక్ష్మణరెడ్డికి కూడా మద్యపాననిషేధ ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇచ్చి నెలకు రూ.నాలుగు లక్షలకుపైగా సమర్పిస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ లక్ష్మణరెడ్డి పూర్తిగా అడ్డం తిరిగారు. జగన్ పాలన అత్యంత దారుణంగా ఉందంటున్నారు.
విజయవాడలో జగన్ పాలనపై కలసి పోరాడేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అనూహ్యంగా ఈ సమావేశానికి లక్ష్మణ్ రెడ్డి కూడా వచ్చారు. సమావేశంలో ప్రసంగించి..జగన్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ప్రజలు ప్రధానసమస్యలు చర్చించకుండా సమస్యలు కానివాటిని సమస్యలుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇదివరకు నిరంతరం ఏదో ఒకసమస్యపై పోరాడేవారు. అలాంటివారు ఇప్పుడు 1వ తేదీన జీతం వస్తే చాలనుకుంటున్నారని.. రైతులు, మహిళలు వారి సమస్యలపై పోరాడకుండా చేస్తున్నారన్నారు.
2014-19తో పోలిస్తే ఈ ప్రభుత్వంలో రాష్ట్రానికి వచ్చే ప్రత్యక్షవిదేశీపెట్టుబడులు 14రెట్లు తగ్గాయని.. 1952 నుంచి చూస్తే ఇరిగేషన్ ప్రాజెక్ట్ లకు ఈ ప్రభుత్వం కేటాయించిన నిధులు చాలాచాలా తక్కువన్నారు. సామాజిక పురోగతిసూచిలో రాష్ట్రం 23వ స్థానంలో ఉండటం బాధాకరమన్నారు. రాష్ట్రంలో వేలకోట్ల అవినీతి జరుగుతున్నా దానిపై ఎవరూ మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యపాననిషేధ ప్రచారకమిటీకి ఛైర్మన్ గా ఉన్న నేను, జగన్ రెడ్డి ఇచ్చిన హామీని నమ్మానని.. కానీ మద్యపాననిషేధం గురించి ఏం చేయబోతున్నారోనన్న ఉత్సుకతతో తాను ముఖ్యమంత్రిని కలిసినప్పుడు తీవ్రంగా నిరుత్సాహపడ్డానన్నారు. గతంలో ఒక ప్రైవేట్ మద్యం దుకాణం పరిధిలో సాధారణంగా చుట్టూ వందబెల్ట్ షాపులు ఉండేవి…కానీ ఇప్పుడు ఒక బైక్ తీసుకొని ఇంటింటికీ మద్యం అమ్ముతున్నారు. ప్రతి ఊరిలో కల్తీమద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయన్నారు.
జగన్ ను నమ్మి మోసపోయిన వాళ్లు ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున బయటకు వస్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖులు ఎక్కువగా ఉటున్నారు. ఇప్పుడు మనోడు ..అని గత ప్రభుత్వంపై ఎన్నో ఆరోపణలు.. చేసి..ఎంతో సహకరించి లక్మణరెడ్డి లాంటి వాళ్లుకూడా బయటకు వస్తున్నారు. ముందు ముందు ఎవరు బయటకు వస్తారో మరి !