“అమ్మాయ్ చంద్రబాబును జగన్ గట్టిగా తిట్టమంటున్నాడు” అని ఓ ప్లీనరీలో ఉమ్మారెడ్డి ఆన్ చేసిన మైక్ ముందు నించున్న రోజాకు అందరికీ వినబడేలా సలహా ఇచ్చారు. అందరూ అప్పుడే నోళ్లు నొక్కుకున్నారు. ఇప్పుడు సీఎం జగనే నేరుగా చెబుతున్నారు. పార్టీ నేతలకు అయితే.. ఆయన పరోక్షంగా చెబుతారు. కానీ అధికారులు..కలెక్టర్లకు కాబట్టి.. నేరుగానే చెప్పారు.. తిట్టమని. మీడియా, విపక్షాల్ని గట్టిగా తిట్టాలని ఆయన నేరుగా ఆదేశాలిచ్చేశారు.
అధికారులేమీ రాజకీయ నేతలు కాదు. రాజకీయనేతల్ని తిట్టడానికి. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంలో కొంత మంది అధికారులు అదే పని చేస్తున్నారు. అయితే జగన్ ను పొగడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు కానీ విపక్షాలను తిట్టడం లేదు. వీరంతా విధేయ సర్వీస్ అధికారులు. నేరుగా ప్రతిపక్షాల్ని తిట్టకపోయినా… వారి అంతు చూడటానికి తమ పవర్ మొత్తం చూపిస్తున్నారు. వీరంతా విధేయ సర్వీస్ అధికాలులు. ఇప్పుడు వైసీపీ నేతల మాదిరిగా ఎవరెవరు టీడీపీ , మీడియాను తిట్టడానికి తెరపైకి వస్తారన్నది ఆసక్తికరం.
ప్రస్తుతం సివిల్ సర్వీస్ అధికారుల్లో చాలా మంది ప్రభుత్వం చెప్పినట్లుగా చేసేవారున్నారు. ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులైన వారే కీలకమైన స్థానాల్లో ఉన్నారు. అలాగే కలెక్టర్లు, ఎస్పీలు కూడా అత్యంత నమ్మకస్తులే ఉన్నారు. ఇప్పుడు జగన్ నేరుగా తిట్టమని ఆదేశించినందున ఇలాంటి వారు ఇక ముందు మీడియా సమావేశాలు పెట్టి ప్రతిపక్ష నేతల్ని టార్గెట్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎంత ఎక్కువ మంది ఉంటే.. జగన్ అధికారులపై అంత పట్టు సాధించారని అనుకోవచ్చు. ఒక వేల ఎవరూ తిట్టడానికి ముందుకు రాకపోతే.. అధికారుల్లో జగన్ పై నమ్మకం పోయిందనే ప్రచారం జరుగుతుంది.
అయితే ఈ ప్రభుత్వ కాలం అయిపోయే లోపు రిటైర్మెంట్ అయ్యే వారు లేదా… వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వైసీపీ తరపున బరిలోకి దిగాలనుకున్న వారు మాత్రం ముందుకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ రాజకీయ చదరంగంలో జిల్లా అధికారులే చివరకు బలిపశువులయ్యేదని ఎక్కువ మందికి క్లారిటీ ఇంది. ఈ జాబితాలో ఎంత మంది ఉంటారో ?