జగన్ కోసం ఐదేళ్లు జన విజ్ఞాన వేదిక అనే పేరుతో చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేసిన లక్ష్మణరెడ్డి జగన్ ప్రభుత్వంపై మూడున్నరేళ్లకే విరక్తి చెందారు. విపక్షాలన్నీ జగన్ ప్రభుత్వ అరాచక పాలనను ఖండించడానికి అఖిలపక్ష సమావేశం పెట్టుకుంటే ఆయనఅక్కడకు వెళ్లి జగన్ పాలనను దారుణంగా విమర్శించారు. ఈయనకు మద్యపాన నిషేధ ప్రచార కమిటీ చైర్మన్ ఇచ్చి నెలకు రూ. నాలుగు లక్షల వరకూ ప్రజాధనాన్ని ముట్టచెప్పారు జగన్. అయితే తనకు వస్తున్న రూ.నాలుగు లక్షల కన్నా.. రాష్ట్రానికి జరిగిన నష్టం ఎక్కువ అని ఆయన మనసుకు అనిపించిందేమో కానీ.. నోరెత్తారు.
నిజానికి లక్ష్మణరెడ్డి ఒక్కరే కాదు ఇటీవలి కాలంలో చంద్రబాబుకు వ్యతిరేక ప్రచారం చేసి.. జగన్ కోసం పని చేసిన అనేక మందిలోఅసంతృప్తి కనిపిస్తోంది. పని లేకపోయినా డబ్బులు వచ్చే పదవుల్లో నియమించి చాలా మందిని సైలెంట్ చేశారు కానీ.. వారంతా ఇప్పుడు బయట పడుతున్నారు. తమ ఇమేజ్ కు దెబ్బ పడుతుందనో… ప్రభుత్వం మారే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ముందు జాగ్రత్త పడాలనే.. ప్రభుత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలతోతెరపైకి వస్తున్నారు. త్వరలో మరికొంత మంది ఇలా పదవులు తీసుకున్న వారుతెరపైకి వస్తారన్న ప్రచారం జరుగుతోంది.
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలోవైరల్ అవుతున్న వీడియోల్లో సీఎం జగన్ సామాజికవర్గం వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. ప్రభుత్వం తీరుపై వారు నేరుగా మండిపడుతున్నారు. ప్రభుత్వ పాలసీల వల్ల ఓ వైపు వ్యక్తిగత నష్టం.. మరో వైపు రాష్ట్రానికినష్టం జరుగుతోందని అంటున్నారు. ప్రచారం చేసుకోవడానికి సరిపోతుంది కానీ ప్రజలు నమ్మేలా ఉండాలని.. అలాంటి పరిస్థితి లేకుండా పోయిందని ఎక్కువ మంది భావన. సొంత వాళ్లు కూడా ఎందుకు దూరమవుతున్నరో జగన్ అర్థం చేసుకుంటున్నారో లేదో మరి !