తెలంగాణ సీఎం కేసీఆర్ ఒత్తిడిలో ఉన్నారు. ఆయన చుట్టూ ఇప్పుడు అనేక సవాళ్లు వచ్చి పడ్డాయి. మొదటిది పార్టీనేతలపై కేసులు.. రెండోది సీబీఐ తన దాకా వచ్చే పరిస్థితి.. మూడోది బీఆర్ఎస్…నాలుగోది తెలంగాణ ఆర్థిక సవాళ్లు. వీటిపై కేసీఆర్ దృష్టి పెట్టలేపోతున్నారు. దీంతో అనుకున్న పనులన్నీ వాయిదా పడుతున్నాయి. ఇ
ఎమ్మెల్యేలకు ఎర కేసు . కేసు సీబీఐకి వెళ్లడం వల్ల మరింత టెన్షన్ కు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ పార్టీ నేతలను వరుసగా కేసులు వల్ల వారికి న్యాయ సహాయం అందించేందుకు సీఎం కేసీఆర్ స్వయంగా జోక్యం చేుకుంటున్నారు. ఫామ్ హౌస్ కేసులో ఈడీ నోటీసులు ఇవ్వడంతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అంశాన్ని టేకప్ చేశారు. దాదాపుగా ప్రతీ రోజూ రోహిత్ రెడ్డి ప్రగతి భవన్‌కు వెళ్లి కేసీఆర్ ను కలుస్తున్నారు. మరో వైపు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విషయంలోనూ ప్రత్యేకంగా న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
ఇప్పుడు కొత్తగా ఫామ్ హౌస్ కేసు పూర్తిగా సీబీఐకి చేతుల్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. హైకోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్‌కు లేదా సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేయాల్సి ఉంది. లేకపోతే.. ఈ కేసు అనేక మలుపులు తిరిగి రాజకీయంగా కేసీఆర్‌కు ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై కేసీఆర్ తన సమయాన్ని వెచ్చించక తప్పదని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.
క్రిస్మస్ తర్వాత కేసీఆర్ ఢిల్లీకి వెళ్లాలనుకున్నారు. కానీ వెళ్లలేకపోయారు. ఆరు రాష్ట్రాలకు కిసాన్ సెల్ కమిటీలను ప్రకటించాలనుకున్నారు. కానీ వాయిదా పడింది. బీఆర్ఎస్ తరపున అన్ని రాష్ట్రాలకు కన్వీనర్లను నియమించాలని అనుకుంటున్నారు. బీఆర్ఎస్ భావజాలాన్ని మరింతగా తీసుకెళ్లడానికి సాహితీ వేత్తలతోనే సంప్రదింపులు జరపాలనుకుంటున్నారు. ఇవన్నీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నాయి. కేంద్రం వల్ల తెలంగాణకు రూ. 40వేల కోట్లకుపైగా ఆదాయ నష్టం జరిగిందని..ఈ విషయాన్ని అసెంబ్లీలో కూలంకుషంగా చర్చించి ప్రజల ముందు ఉంచారని కేసీఆర్ నిర్ణయించారు. డిసెంబర్లో వారం పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరపాలని ఆదేశించారు.అయితే ఈ నెల అసెంబ్లీ సమావేశాలను నిర్వహించలేకపోయారు.