వారంలో సీపీఎస్ రద్దు అని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ఇప్పుడు.. . అసలు తర్వాత కూడా ఎవరూ సీపీఎస్ రద్దు చేయకుండా చట్టం చేయబోతున్నట్లుగా ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సీపీఎస్ ఇప్పటికే అమలవుతోంది. అయితే భవిష్యత్ లో కూడా ఎవరూ రద్దు చేయకుండా రాష్ట్ర స్థాయి చట్టం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రత్యేకంగా చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదన బిల్లు ఇప్పటికే ఆర్థికశాఖ వద్దకు చేరింది.
ఆర్థికశాఖ పరిశీలన తరువాత న్యాయశాఖకు బిల్లు ముసాయిదా వెళ్లనుంది. బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రతిపాదించే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు అనుమానిస్తున్నాయి. 2014 సెప్టెరబర్ ఒకటి నురచే సిపిఎస్ అమలులోకి వచ్చిరది. అప్పటి నుండి అమలు చేస్తున్నప్పటికీ ఇంతవరకు చట్టబద్దత లేదు. సీపీఎస్ అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేస్తున్న ఆదేశాలు, సర్క్యులర్లు వల్ల భవిష్యత్తులో న్యాయపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉందని ప్రభుత్వం అనుమానిస్తోంది. రాష్ట్ర స్థాయిలో చట్టం రూపొందించమే మార్గమని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
జగన్ సర్కార్ ఈ చట్టాన్ని చేస్తే ఇక భవిష్యత్లో వచ్చే ప్రభుత్వాలు కూడా సీపీఎస్ ను రద్దు చేయలేవని భావిస్తున్నారు. ఇప్పటికే సీపీఎస్ విధానాన్ని కొనసాగిస్తామని చెప్పి ప్రభుత్వం అదనపు అప్పులు తెచ్చుకుంటోంది. ఇప్పుడు సీపీఎస్ రద్దు చేయకుండా చట్టం చేయడం ద్వారా మరిన్ని అప్పులకు మార్గం సుగమం చేసుకుంటుందేమోనన్న సందేహం ఉద్యోగుల్లో ఉంది. ఇంత దారుణంగా మాట తప్పిన జగన్ పై ఉద్యోగులు మండిపోతున్నారు.