బుల్లి తెర రియాలిటీ షో బిగ్ బాస్ వల్ల చాలా మందికి ఫేమ్ వచ్చింది. కాకపోతే… వాటిలో కొంతమంది మాత్రమే సినిమాల్లోనూ రాణించగలిగారు. బిగ్ బాస్ విజేతలుగా నిలిచిన శివ బాలాజీ, కౌశల్, రాహుల్ సిప్లిగంజ్, అభిజిత్, బిందు మాధవి… వీళ్లెవరూ సినిమాల్లో పెద్దగా అవకాశాలు సంపాదించలేదు. అయితే… రన్నరప్‌గా నిలిచిన వాళ్లు, లేదంటే.. మధ్యలోనే సర్దుకుని వెళ్లిపోయిన వాళ్లు మాత్రం సినిమాల్లో అవకాశాలు బాగానే సంపాదిస్తున్నారు. సోహైల్‌కి కూడా మంచి అవకాశాలొచ్చాయి. ఏకంగా హీరో అయిపోయాడు. తను నటించిన `లక్కీ లక్ష్మణ్` ఈ వారమే విడుదల అవుతోంది. ఈ సినిమాకి ఏకంగా రూ.6 కోట్ల పెట్టుబడి పెట్టినట్టు టాక్. బిగ్ బాస్ నుంచి వచ్చిన ఓ హీరోపై ఇంత మొత్తం పెట్టడం గ్రేటే. అనూప్ రూబెన్స్, ఆండ్రూ, ప్రవీణ్ పూడి.. ఇలాంటి టెక్నీషియన్లు ఈ సినిమాకి పనిచేశారు. అందుకే అంత ఖర్చయ్యింది. సోహైల్‌కి బిగ్ బాస్ సమయంలో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇన్‌స్టాలో లక్షలమంది ఫాలోవర్స్ ఉన్నారు. మరోవైపు వీజే సన్ని హీరోగా `అన్ స్టాపబుల్` రూపుదిద్దుకొంది. మరి వీళ్లను చూడ్డానికి జనాలు థియేటర్లకు వస్తారా? బిగ్ బాస్ ఫేమ్ వెండి తెర కంటిన్యూ అవుతుందా? అనేది పెద్ద క్వశ్చన్. ఒకవేళ… ఈ సినిమాలకు పెట్టుబడి తిరిగొచ్చినా – బిగ్ బాస్ హీరోలు.. వెండి తెరపై కూడా ఇంకొన్నాళ్లు మెరుస్తారు.