కుందుకూరులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిర్వహించిన కార్యక్రమంలో .. ఓపెన్ నాలాలో ఒకరిపై ఒకరు పడి ఎనిమిది చనిపోయారు. ఈ ఘటనపై అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా స్పందించారు. చనిపోయిన టీడీపీ కార్యకర్తలు ఒక్కో కుటుంబానికి రూ. రెండు లక్షల సాయం ప్రకటించారు. గాయపడిన వారికి రూ. యాభై వేలు పరిహారం ఇచ్చారు. టీడీపీ ఇప్పటికే ఆ కుటుంబాల బాధ్యత తీసుకుంటామని ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ. పది లక్షల సాయం ప్రకటించింది. పార్టీ నేతలు ఆయా కుటుంబాలకు అండగా ఉండి.. ఇతర పనులు చేస్తున్నారు.
అయితే ఎప్పుడైతే ఈ విషాదం చోటు చేసుకుందని తెలిసిందో అప్పుడే వైసీపీ నేతల్లో వికృతానందం కనిపించడం ప్రారంభమైంది. మొదట సోషల్ మీడియాతో ప్రారంభించింది.. ఆ తర్వాత సాక్షి మీడియాలో ఎంత శవరాజకీయం చేయాలో చేసి.. ఇప్పుడు నేరుగా ఆపార్టీ నేతలు రంగంలోకి దిగారు. ఇదంతా చంద్రబాబు తప్పు అని.. శవాలతో తమదైన బ్రాండ్ రాజకీయం చేయడం ప్రారంభించారు. ఇది మరింత ఉద్ధృతంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.
నిజానికి తొక్కిసలాటలు జగన్ సభల్లో ఎన్నో జరిగాయి. ఇటీవల విజయవాడలో నిర్వహించిన జయహో బీసీ సభలో భోజనల దగ్గర తొక్కిసలాట చోటు చేసుకుని ఒకరు చనిపోయారు. కనీసం ఆ కుటుంబాన్ని సీఎం జగన్ పరామర్శించలేదు. సాక్షి పత్రికలో అస్వస్థతతో చనిపోయాడని ప్రచారం చేసి రూ. పది లక్షల సాయం ఇచ్చారు. గోదావరి జిల్లాల్లో జరగిన సభలో ఓ వృద్ధురాలు చనిపోయింది. ఆమె కుటుంబానికి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఇక జగన్ పాదయాత్రలో తొక్కిసలాటల గురించి చెప్పాల్సిన పని లేదు. తొలి రోజే వ్యక్తి చనిపోయాడు. ఇలా ఎన్నో ఘటనలు జరిగినా… తెలుగుదేశం పార్టీ నేతులు ఎప్పుడూ శవరాజకీయాలు చేయలేదు. కానీ వైసీపీకి ఇదేం బుద్దో కానీ.. ఎక్కడైనా శవం కనిపిస్తే చాలు వారిలోని రాజకీయం అంతా బయటకు వస్తుంది
జరిగింది దుర్ఘటన.. దానికి కారణాలేమిటో అన్వేషించాలి. బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలి కానీ.. ఇలా ప్రతీ దాడికి రాజకీయాలు చేసుకుని వికృతానంతం పొందితే వారికేమి వస్తుందో వారికే తెలియాలి. రాజకీయాలు అంటే ఇంతే అని జనం అసహ్యించుకోవడం తప్ప.. వారు మాత్రం ఎప్పటికీ మారరు.