ప్రధానమంత్రి ఏపీ సమస్యలపై వినతి పత్రం ఇస్తే .. ఏ శాఖకు సంబధించి అయినా కాస్త పద్దతిగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రధాని … ఎవరినైనా ఆదేశించగలరు. కానీ హోంమంత్రికి కూడా అన్ని శాఖల సమస్యలు తీర్చాలని వినతి పత్రం ఇస్తే దాన్ని ఏమంటారు ?. సీఎం జగన్ అదే చేస్తున్నారు. బుధవారం రాత్రి అమిత్ షాను కలుస్తారని ప్రచారం జరిగినా అపాయింట్మెంట్ దొరకలేదు. కానీ గురువారం ఉదయం ఆయనకు సమయం ఇచ్చారు. జగన్ వెళ్లారు. దాదాపుగా ఇరవై నిమషాల సేపు మాట్లాడారు. బయటకు వచ్చారు. లోపల ఏం మాట్లాడారో తెలియదు. కానీ బయటకు వచ్చాక ఓ ప్రెస్ నోట్ మీడియాకు అందింది.
అందులో పోలవరం ప్రాజెక్ట్ నిధుల దగ్గర్నుంచి .. తెలంగాణ ఇవ్వాల్సిన కరెంట్ బకాయిల వరకూ అన్నింటినీ ప్రస్తావించారు. వాటన్నింటినీ పరిష్కరించాలని కోరారు. అసలుజగన్ దాదాపుగా పన్నెండు రకాల అంశాలపై విజ్ఞప్తులు చేస్తే అందులో ఒకే ఒక్కటి హోంశాఖకు సంబంధించినది ఉంది. నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ క్యాంపస్‌ను తిరుపతిలో పెట్టాలని కోరారు. ఇక మిగతా ఏ వియషం కూడా హోంశాఖకు సంబంధం లేనిదే.
2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ బకాయిలు, 10వ వేతన సంఘం బకాయిలు ఇలా రూ. 32,625.25 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని వెంటనే మంజూరు చేయాలని అమిత్ షాను జగన్ కోరారు. పపోలవరం ఖర్చు.. ఆహార భద్రచట్టంలో మార్పులు లేకపోవడం వల్ల జరుగుతున్న నష్టం.. ప్రత్యేక తరగతి హోదా ఇలా అన్ని అంశాలను ప్రస్తావించారు. విశాఖ మెట్రో రైల్ డీపీఆర్ అసలు ఏపీ ఇవ్వలేదని కేంద్రం చెబుతూంటే.. దాన్ని కూడా అడిగామని సీఎ పీఆర్వోలు లేఖ విడుదల చేశారు.
జగన్ అడిగినవన్నీ హోంశాఖకు సంబంధంలేనివే. ఒక వేళ జగన్ వాటిని అడుగుతూంటే.. వాటితో తనకేం సంబంధం అని..తనది హోంశాఖ అని ఖచ్చితంగా అమిత్ షా చెబుతారు. ఎందుకంటే.. ఆయన ఇవన్నీ విన్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. సంబంధిత మంత్రి వద్ద చెప్పుకోమంటారు. అయినా ప్రెస్ నోట్లు రిలీజ్ చేసేవారికి.. జగన్ ప్రధానికి ఇచ్చినట్లే ఇతర మంత్రులకూ అన్నివిజ్ఞాపనలు చేయరని ఎందుకు అనుకోరో మరి !