ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి ఒకటో తేదీ నుంచి ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ ను ఉద్యోగులందరికీ కంపల్సరీ చేసింది. ఒకటో తేదీ ఆదివారం అయినప్పటికీ ఆ రోజు నుంచే ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఉపాధ్యాయులకు అమలు చేస్తున్నారు. సొంత ఫోన్లలో యాప్ డౌన్ లోడ్ చేసుకుని.. ఈ హాజరు వేసుకోవాల్సి ఉంటుంది. పది నిమిషాలు ఆలస్యమైనా జీతం కట్ చేస్తామని ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులపై ఉద్యోగులు మండి పడుతున్నారు. అటెండెన్స్ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర ఇబ్బందులు సృష్టించేవిగా ఉన్నాయంటున్నారు.
పది నిమిషాలు ఆలస్యంగా వస్తే జీతం కత్తిరిస్తామంటున్నారని.. మరి జీతాలు ఎప్పుడిస్తారో తెలియకుండా మానసిక వ్యధకు గురి చేస్తున్న ప్రభుత్వానికి ఎలాంటి శిక్ష వేయాలని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగ విధులు భరించలేనంతగా పెంచుతూ.. హాజరు విషయంలో లేనిపోని నిబంధనలు పెడుతున్న ప్రభుత్వం జీతాలిచ్చే విషయంలో అంత పర్ ఫెక్ట్ గా ఎందుకు ఉండటం లేదని ప్రశ్నిస్తున్నారు. ఒక్క జీతాలే కాదు.. . తమకు రావాల్సిన ప్రయోజనాలు, పీఎఫ్ .. ఇతర సౌకర్యాలకు సంబంధించిన నగదు వాడుకున్నారని వాటన్నింటినీ ఎందుకు ఇవ్వడం లేదని ఉంటున్నారు.
ప్రభుత్వ తీరుపై ఉద్యోగులు మొదటి నుంచి అసంతృప్తితో ఉన్నారు. పీఆర్సీ ఇవ్వకుండా బ్లాక్ మెయిల్ చేయడం… ఉద్యమించిన ఉద్యోగ సంఘాలపై కేసులు పెట్టడం వంటివి చేయడంపై వారు రగిలిపోతున్నారు. ఇప్పుడు ఉద్యోగులుక ఫేస్ అటెండెన్స్ పెట్టి.. మరింత ఇబ్బందులు పెడుతున్నారని అంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల సమస్యలపై ఎప్పటికప్పుడు సమావేశాలు పెడుతున్నట్లుగా చెబుతుంది కానీ.. ఒక్క సమస్యా పరిష్కరించడం లేదు. కొత్త కొత్త టెన్షన్లు పెడుతున్నారన్న వాదన వినిపిస్తోంది.