వైసీపీకి ఒక్క ఓటు వేసినందుకు విభజిత ఏపీని మూడు రాష్ట్రాలు చేసేస్తోంది. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడంలో చివరికి ప్రత్యేక రాష్ట్రం అనే నినాదానికి వచ్చేశారు. ఇప్పటికే రాయలసీమలో ప్రత్యేక రాష్ట్ర వాదనను ఆ పార్టీ నేతలు వినిపిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఉత్తరాంధ్రలోనూ ప్రారంభించారు. ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం అని ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. ఎలాగైనా మనసుల్లో ప్రత్యేక రాష్ట్రం అనే బీజం నాటారంటే.. రాజకీయ అవసరాల కోసం ఎప్పటికప్పుడు వాటిని పెంచుకునే నేతలు ఉంటూనే ఉంటారు. అందుకే.. ఒక్క సారి ఓటు వేసినందుకు.. వైసీపీ .. విభజన ఆంధ్రప్రదేశ్ ను మూడు ముక్కలు చేయడానికి పునాదులు వేసేసినట్లయింది.
తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని టీడీపీ నడిపింది. అమరావతి రాజధానిని ఏకగ్రీవంగా అందరితో ఆమోదింప చేసి నిర్మాణం ప్రారంభించారు. ప్రతీ ప్రాంతానికి పరిశ్రమలు, అభివృద్ధి వికేంద్రీకరించింది. ఒక్క చోట ప్రాంతీయ ఉద్యమం రాలేదు. కానీ ఘనత వహించిన వైసీపీ అధినేత సీఎం జగన్ కాగానే.. ప్రాంతీయ ఉద్యమాగల చిచ్చు పెట్టారు. ఎవరూ అడగకపోయినా..మూడు రాజధానులు ప్రకటించేశారు. ఎందుకంటే అభివృద్ధి వికేంద్రీకరణ అన్నారు. ఈ మూడు రాజధానులకు అభివృద్ధికి సంబంధం ఏమిటో ఎవరికీ తెలియదు.. వైసీపీ చెప్పదు.. కానీ మూడు రాజధానులు అడ్డుకున్నారంటూ విద్వేషాలు మాత్రం పెంచుతున్నారు.
ఎలా చూసినా ప్రాంతీయ ఉద్యమాలు భవిష్యత్ లో ఏపీని రావణ కాష్టం చేయడం ఖాయంగా కనపిస్తోంది. అధికారం అందని పార్టీలు వీటిని అందుకుంటాయి. అందులో సందేహం లేదు. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఇప్పుడే వైజ్ గా ఆలోచించాలి. రాయలసీమ.. ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ష్రాలను ఏర్పాటు చేయాలి.కోస్తా ప్రాంత వాసుల ప్రత్యేక రాష్ట్రం అడగకపోయినా విడిపోతామంటే..కలిసి ఉండాలని వారు ఉద్యమాలు చేయరు. అందుకే ఒక్క ఓటుతో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసిన ఘనతను దక్కించుకోవాలంటే.. వైసీపీకి ఒక్కటే మార్గం.. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయడం. అది చేసేస్తే.. పతనం సంపూర్ణం అవుతుంది.