తెలుగు ప్రజలకు సినిమా అంటే ఓ ఎమోషనల్. ప్రతీ సంక్రాంతికి ఓ టాప్ హీరో సినిమాను చూడటం.. తమ సంక్రాంతి సంబరాల్లో భాగం చేసుకుంటారు. అలాంటిది ఈ సారి ఓ తమిళం హీరో తెలుగు ప్రజలతో ఆటాడుకోవడానికి రాబోతున్నాడు. ఆ హీరో సినిమాను మనం ఎందుకు చూడాలి అనుకునే అవకాశం ఉన్నా.. బలవంతంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ధియేటర్లు మావి కాబట్టి… అదే సినిమాను అత్యధిక ధియేటర్లలో రిలీజ్ చేస్తామని చెబుతున్నారు. ఇప్పుడిది టాలీవుడ్లో వివాదం. కానీ తెలుగు ప్రేక్షకులను అవమానించడమే. తెలుగు సినీ అభిమానుల్ని మోసం చేయడమే.
విజయ్‌కు తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉంది ?
తమిళ హీరో దళపతి విజయ్ కు తమిళంలో గొప్ప ఫాలోయింగ్ ఉంది. అక్కడ అగ్ర కథానాయకుల్లో ఒకరు. కానీ ఏపీలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ ఎంత ? అలాంటి హీరో సినిమాను ఇప్పుుడు చిరంజీవి, బాలకృష్ణ సినిమాల కంటే ఎక్కువ ధియేటర్లలో రిలీజ్ చేయాడనికి ప్రయత్నాలు చేస్తున్నారు. చేస్తున్నారు కూడా. ఎందుకంటే..ధియేటర్లు మావి అంటున్నారు నిర్మాతలు.
బలవంతంగా విజయ్ సినిమాను చూపిస్తారా ?
సంక్రాంతికి … చిరంజీవి, బాలకృష్ణ తమ సినిమాలతో వస్తున్నారు. తెలుగు సినీ ప్రేక్షకులకు పండగే. సినీ అభిమానులు రెండు సినిమాలూ చూస్తారు. ఈ అభిమానుల్లోనే ఆయా హీరోల ఫ్యాన్స్ ఉంటారు. అయితే ఈ సారి ఈ ఇద్దరి సినిమాలు చూడాలంటే పెద్దగా ధియేటర్లు కనిపించవు. ఎందుకంటే వీరిద్దరి సినిమా కంటే ఎక్కువగా విజయ్ సినిమానే ధియేటర్లలో కనిపించనుంది. ఈ డిబ్బింగ్ సినిమా ఏందిరా బాబూ అని జనం గొణుక్కుంటారు. కానీ కొంత మంది అయినా వచ్చి చూస్తారని .. తప్పనిసరిగా చూడాల్సిన పరిస్థితి వస్తుందని.. నిర్మాత ఆశపడుతున్నాడు. అదే ఉద్దేశంతోనే..చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు ధియేటర్లు పరిమితం చేసి .. తన సినిమా రిలీజ్ చేసుకుంటున్నారు.
తెలుగు సీనియర్ హీరోలను తక్కువ చేయడమే.. !
విజయ్ సినిమా రిలీజ్ వ్యవహారం టాలీవుడ్ నుంచి ఎదిగి.. టాలీవుడ్ ను తక్కువ చేయడమే. టాలీవుడ్ లో సమస్యలు ఉన్నాయని షూటింగ్ లు ఆపేసి.. ఈ వారీసు షూటింగ్ ను మాత్రం కొనసాగించారు. దీనికి కారణంగా .. అది డబ్బింగ్ సినిమా అని చెప్పారు. ఇప్పుడు అదే్ డబ్బింగ్ సినిమాను.. రెండు అగ్రహీరోల కన్నా ఎక్కువగా ధియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఇది సీనియర్ హీరోలను .. అవమానించడమే. తమ చేతిలో ధియేటర్లు ఉన్నాయని.. తమ సినిమా రీలీజ్ చేసుకుంటామని వాదిస్తున్నారు. కానీ తమ పునాదుల గురించి ఆలోచించడం లేదు.
ప్రస్తుత సినిమాలు ఓపెనింగ్స్ మీదనే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టుకోవాలనుకుంటున్నారు. ఇద్దరు అగ్రహీరోలకు.. తమిళ హీరోను పోటీ పెట్టి.. వాటి మధ్య ధియేటర్లను ఎక్కువగా చేసుకుని ఓపెనింగ్స్ రాబట్టుకోవాలనుకుంటున్నారు. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం షాకివ్వడం ఖాయం.