కొత్త ఏడాది వస్తే ప్రతీ ఒక్కరూ హ్యాపీ న్యూ ఇయర్ చెబుతారు. ప్రతి ఒక్కరికి వందల కొద్దీ మెసెజులు వస్తాయి. ఇంత మంది హ్యాపీగా ఉండమని చెబుతున్నారు కదా..అని అందరూ హ్యాపీగా ఉండలేరు. ఎందుకంటే.. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పిన ఒక్కరు కూడా.. మనకు హ్యాపీ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే.. ఆ ఆనందం అనేది మనకు మనం తెచ్చుకునేది. ఒకరు ఇచ్చేది కాదు. ఈ విషయంపై మనకు క్లారిటీ వస్తే నిజంగానే ఇయర్ మొత్తాన్ని హ్యాపీగా ఉంచుకోవచ్చు.
సాధారణంగా మనిషి అన్ హ్యాపీకి కారణం … అంతులేని ఆశ.. పగ.. ద్వేషం. సాధారణంగా ఇవన్నీ మనిషికి పనికి రాని అంశాలపైనే ఉంటాయి. ఎలా అంటే.. ఎవడైనా ముక్కూ ముఖం తెలియని వాడు జీవితంలో పైకి ఎదిగితే వాడి గురించి గొప్పగా చెప్పుకుంటాం..అదే మనకు తెలిసిన వాడైతే ఈర్ష్యతో రగిలిపోతాం. వాడికేదో చెడు చేయాలనుకుంటాం. కుదిరితే తప్పుడు ప్రచారంచేస్తాం. అతడి విజయాన్ని మనం సెలబ్రేట్ చేసుకోలేకపోవచ్చు కానీ.. చూసీ చూడనట్లుగా వదిలేస్తే మనం హ్యాపీగా ఉంటాం. అదే స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా ప్రయత్నిస్తే గెలిస్తే గెలుస్తాం..లేకపోతే లేదు..కానీ ఆనందం మాత్రం వస్తుంది.
ఇక జీవితంలో అత్యధిక సమయం సోషల్ మీడియాలో.. రాజకీయం, సినిమా వంటి వాటి మీద అనవసరాల వాదాలతో వృధా చేయడం కూడా.. అన్ హ్యాపీ ఇయర్ కు కారణం అవుతుంది. అసలు మన జీవితంలో వాటికెంత సమయం కేటాయించాలన్నది మనం నిర్దేశించుకోవాలి. సాధారణంగా సినిమా అనేది వినోదం. బాగుంటే చూస్తాం లేకపోతే లేదు… అంతే కానీ కలెక్షన్ల గురించి సోషల్ మీడియాలోవాదనలు పెట్టుకోవాల్సిన పని లేదు. రాజకీయంమూ అంతే. రాజకీయ పార్టీల కోసం ఇతరులతో వాదించడం అంటే.. అంత కంటే తెలివి తక్కువ పని ఉండదు.
ఇక్కడ అసలు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి తగ్గించుకుని.. కుటుంబం పట్ల ఎక్కువ శ్రద్ధ పెడితే.. ఆటోమేటిక్ గా హ్యాపీ న్యూ ఇయర్ అవుతుంది. ఈ సందేశం ఇవ్వడానికి.. పెద్దపెద్ద బాబాలే అవసరంలేదు. జీవితానుభావాలు చెబుతాయి. నేర్చుకుని..హ్యాపీగా ఉండండి.
హ్యాపీ న్యూ ఇయర్