ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కన్నా ఉద్యోగులు ఎక్కువ టెన్షన్ పడుున్నారు. ఒకటో తేదీ దగ్గరకు వచ్చే సరికి.. ప్రభుత్వానికి అప్పు పుట్టాలని వేడుకుంటున్నారు. అప్పు పుట్టిందా లేదా అని .. అదే పనిగా వాకబు చేస్తున్నారు. డిసెంబర్ నెలాఖరు వరకూ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తూనే ఉన్నారు. ఈ నెల అయినా సమయానికి వస్తాయా లేదా అనేది వారి టెన్షన్. ఈ నెల ఒకటో తేదీన ఆదివారం వచ్చింది. దీంతో ఆదివారం జీతం వస్తుందని ఎలాంటి ఆశలు పెట్టుకోలేదు.
అయితే సోమవారం అయినా వస్తుందని అనుకున్నారు. అయితే ఇటీవల సీఎం జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత కూడా.. కేంద్రం నుంచి కొత్త అప్పులకు ఎలాంటి పరిమితులు రాలేదు. ఓడీ సౌకర్యం వాడుకుని.. రెండు వేల కోట్ల వరకూ తీసుకు వచ్చి సామాజిక పెన్షన్లకు పంపిణీ చేసినట్లుగా చెబుతున్నారు. ఇప్పుడు జీతాలివ్వాలంటే.. అటు ఓడీని అధిగమించాలి.. ఇటు అదనంగానిధులు కావాలి. కానీ ప్రతి మంగళవారం ఆర్బీఐ వద్ద వేలం వేసే బాండ్లను ఈ సారి ఏపీ వేయలేకపోతోంది. అంటే కేంద్రం నుంచి ఇం కాఅనుమతి రాలేదని తెలుస్తోంది.
బ్యాంకుల వద్ద నుంచి పోర్టుల కోసం.. ఇతర పనుల పేరుతో పెద్ద ఎత్తున కార్పొరేషన్ల రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పోర్టుల కోసం రూ. పదమూడు వేల కోట్ల లోన్ ఇచ్చేందుకు కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు అంగీకరించాలయని చెబుతున్నారు. అవి అయినా వచ్చాయో లేదో తెలియడం లేదు. కారణం ఏదైనా ప్రభుత్వానికి అప్పు దొరకాలని ఏపీ ఉద్యోగులు మొక్కుకుంటున్నారు.