నిజాం మరో సారి హాట్ టాపిక్ అవుతున్నారు. హైదరాబాద్ చివరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ 90 ఏళ్ల వయసులో చనిపోయారు. ఆయనను హైదరాబాద్లోనే ఖననంచేయనున్నారు. హైదరాబాద్లోని చార్మినార్ సమీపంలో … నిజాం రాజవంశస్తుల అంత్యక్రియలు జరిపే ప్రాంతం ఉంది. అక్కడే తననూ ఖననం చేయాలని ఎనిమిదో నిజాం ఉస్మాన్ అలీఖాన్ కోరుకున్నారు. అందుకే కుటుంబసభ్యులు హైదరాబాద్ కు అంత్యక్రియల కోసం తీసుకు వస్తున్నారు.
మొదట హైదరాబాద్ లోని మక్కా మసీదులో నమాజ్ ఇ జనాజా నిర్వహిస్తారు. చార్మినార్కి దగ్గర్లోనే ఉన్న రాయల్ సమాధుల దగ్గర అంత్యక్రియలు నిర్వహిస్తారు. క్కడే ఏడుగురు నిజాముల సమాధులు ఉన్నాయి. 1980 వరకూ ఇండియాలో అత్యంత ధనవంతుడు ముఖరం ఝానే. 1990లో విడాకుల వల్ల కొంత ధనం కోల్పోయారు. ప్రస్తుతం ఆయన సంపద విలువ రూ.8 వేల కోట్లకు పైనే. ప్రస్తుతం హైదరాబాద్లో చౌమహల్లా ప్యాలెస్, ఫలక్నుమా ప్యాలెస్, నజ్రీబాగ్ ప్యాలెస్, చిరాన్ ప్యాలెస్, నౌఖండా ప్యాలెస్ సహా చాలా ఆస్తులు ఆయన పేరు మీద ఉన్నాయి.
అయితే ఆయన ఆస్తులపై అనేక వివాదాలు ఉన్నాయి. వారసత్వ వివాదాలు లెక్కలేనన్ని ఉన్నాయి. దీనికి కారణం.. ఆయన ఏకంగా ఐదుగుర్ని పెళ్లి చేసుకోవడమే. ఒకరిద్దరు చనిపోయారు. మిగిలిన వారికి విడాకులిచ్చారు. వారంతా ఇప్పుడు తమకు పుట్టిన పిల్లలకు ఆస్తుల్లో వాటా కోసం పోరాటం చేస్తున్నారు. ఆయన ఇండియాను విడిచి పెట్టి టర్కీకి వెళ్లిపోయారు. అక్కడ రాజభోగాలు లభించకపోయినా అక్కడే జీవిస్తున్నారు. చివరికి అక్కడే చనిపోయారు.
మామూలుగా అయితే ఈ అంశం హైలెట్ కాదు.. కానీ రాజకీయం చొరబడింది. కేసీఆర్ అధికారిక లాంఛనలతో అంత్యక్రియలు చేయాలని ఆదేశించగా.. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ.. ఆయన అంత్యక్రియలు జరిపే రోజున సెలవు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఓ వర్గాన్ని ఆకట్టుకోవడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆయన అలా అంటే తామేమైనా తక్కువా అని కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. అయితే నిజాంకు అంత్యక్రియలు ఎక్కువ హైప్ క్రియేట్ చేసినా.. కేసీఆర్ కుఇబ్బందే. ఎందుకంటే..మజ్లిస్ కు కోపం వస్తుంది. మొత్తానికి ఎనిమిదో నిజాం.. చనిపోయాక కొత్త తరంలో ఎక్కువ చర్చనీయాంశం అవుతున్నారు.