హైదరాబాద్: తెలంగాణలో పుష్కర ఘాట్ల వద్ద భద్రతకోసం పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. భద్రాచలంవద్ద భక్తుల రద్దీని గమనించటానికి రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే డ్రోన్(మానవ రహిత హెలికాప్టర్)లను ఉపయోగిస్తున్నారు. డ్రోన్లకు కెమేరాలను అమర్చి వాటిద్వారా రద్దీని పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్లు ఆకాశంలో ప్రయాణిస్తూ దూర ప్రదేశాలలోకూడా రద్దీని పోలీసులకు చూపిస్తున్నాయి.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడు ఇవాళ హెలికాప్టర్ద్వారా ఉభయ గోదావరి జిల్లాలలోని పుష్కర ఘాట్లను పరిశీలించారు. రాజమండ్రి, కొవ్వూరు, నరసాపురం, రావులపాలెంలలో ఉన్న పుష్కర ఘాట్లవద్ద పరిస్థితులను పర్యవేక్షించారు. ఈ పదిరోజులపాటు ముఖ్యమంత్రితోబాటు రాజమండ్రిలోనే బసచేస్తానని రాముడు చెప్పారు. అదనపు బలగాలను తెప్పించామని తెలిపారు.