అక్కినేని నాగేశ్వరరావును కించపరుస్తూ తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని బాలకృష్ణ స్పష్టం చేశారు. హిందూపురంలో బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అక్కినేని.., తొక్కినేని అంటూ వీరసింహారెడ్డి సినిమా విజయోత్సవంలో చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. అక్కినేని నాగేశ్వరరావు తనపై తన పిల్లల కంటే ఎక్కువ ప్రేమ చూపేవారన్నారు. తాను బాబాయ్ అని పిలుచుకునేవాడిని.. ఆయనపై ప్రేమ తనకు గుండెల్లో ఉంటుందన్నారు. ఏదో ఫ్లో లో వచ్చిన మాటలను వక్రీకరించుకుని వ్యతిరేక ప్రచారం చేస్తే తనకేం సంబంధం అని ప్రశ్నించారు.
పొగడ్తలకు పొంగి పోకూడనదే విషయాన్ని తాను అక్కినేని నాగేశ్వరరావు నుంచే నేర్చుకున్నానన్నరు. ఎన్టీఆర్ను ఎన్టీవోడు అంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో యాసలో పిలుస్తూంటారు..అదంతా ఆయనపై చూపే అభిమానమేనని గుర్తు చేశారు. సినీ ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లు లాంటి వారని.. స్పష్టం చేశారు. ఎన్టీఆర్ నేషనల్ అవార్డు పెడితే మొదట .. అక్కినేని నాగేశ్వరరావుకే అవార్డు ఇచ్చామని గుర్తు చేశారు.
వీరసింహారెడ్డి సినిమా విజయోత్సవంలో బాలకృష్ణ మాట్లాడుతున్నప్పుడు రచయితతో షాట్ గ్యాప్లో ఏం మాట్లాడుకునేవారమో వివరించారు. ఈ సందర్భంగా అక్కినేని… తొక్కినేని అనే మాటలు వాడారు. అయితే అక్కినేని తర్వాత ప్రాసలో తొక్కినేని అని పదం రావడంతో.. ఈ అంశం వివాదాస్పదమయింది. అలాగే ఆ రంగారావు అనే మాట కూడా వాడారు. దీంతో సోషల్ మీడియాలో బాలకృష్ణపై కొంత మంది విమర్శలు ప్రారంభించారు. ఇదే సమయంలో నాగ చైతన్య, అఖిల్ కూడా.. ఏఎన్నార్ లైవ్స్ ఆన్ పేరుతో సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. కించపర్చడం కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎ
మరో వైపు కాపు నాడు పేరుతో ఓ సంఘం కూడా… ఎస్వీ రంగారావును బాలకృష్ణ అవమానించారని ఆరోపణలు చేశారు. ఆయన క్షమాపణలు చెప్పాలన్నారు. అయితే ఎస్వీరంగారావును బాలకృష్ణ కించపర్చలేదని.. ఈ విషయాన్ని వివాదం చేయవద్దని వీడియో విడుదల చేశారు. ఇప్పుడు అక్కినేనిని తాను కించపర్చలేదని బాలకృష్ణ స్పష్టం చేయడంతో వివాదానికి తెరపడినట్లయింది.