టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర ఎలా సాగుతుందన్న విషయంపై ప్రజల్లోనే కాదు.. టీడీపీ శ్రేణుల్లోనూా ఉన్న అనుమానాలు పటాపంచులు అవుతున్నాయి. ఎన్టీఆర్ మనవడు.. చంద్రబాబు కుమారుడు.. . స్టాన్ ఫర్డ్ చదువులు ఉన్న యువకుడు… సాధారణ ప్రజలతో మమేకం కాగలడా అన్నది ఎక్కువ మందికి ఉన్న సందేహం. ఎందుకంటే ఆయన పెరిగిన కంఫర్ట్ జోన్ అలాంటిది. కానీ లోకేష్ మాత్రం తొలి రోజే ఈ అనుమానాలను పటాపంచలు చేసే ప్రయత్నం చేశారు. రెండో రోజు పూర్తిగా ప్రజలతో మమేకం అయ్యారు.
ఉదయం పేస్ మెడికల్ కాలేజీ విద్యార్థులతో ముచ్చటించి పాదయాత్ర ప్రారంభించారు. తర్వాత బీసీ సంఘాలతో సమావేశం అయ్యారు. అయితే ఇక్కడ బీసీ సంఘాల నేతలతో కాకుండా నేరుగా ఆయా వర్గాల ప్రజలతో మాట్లాడారు. సమస్యలు తెలుసుకున్నారు. కుల వృత్తులు ఈ ప్రభుత్వంలో ప్రమాదంలో పడ్డాయని గుర్తించారు. తమ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఆదరణ పథకం ద్వారా అందరికీ సబ్సిడీ ద్వారా పనిముట్లు ఇతర కుల వృత్తులకు సంంబధించిన పరికరాలు ఇచ్చామని గుర్తు చేశారు. తాము వచ్చాక ఉపాధి పెంచి.. ఆర్థికంగా మెరుగైన పరిస్థితి వచ్చేలా చూస్తామని భరోసా ఇచ్చారు. అలాగే ఆగిపోయిన రెండు బీసీ భవనాల నిర్మాణాలనూ పరిశీలించి.. ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
ఆ తర్వాత పాదయాత్రలో కృత్రిమంగాఏర్పాటు చేసిన వారిని కాకుండా పొంలలో పని చేసుకుంటున్న వారిని తానే వెళ్లి పలకరించారు. అర ఎకరం రైతులు చెప్పుకున్న కష్టాలు వినిపి కరిగిపోయారు. ప్రభుత్వ ప్రభుత్వ తీరు వల్ల రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ రైతుల అనుభవాలతో ప్రజల ముందుంచారు. అలాగే ఓ జంట తమ బిడ్డకుపేరు పెట్టాలని కోరితే.. శాన్విత అని పేరు పెట్టారు. డిగ్రీ కాలేజీ విద్యార్థులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు.
లోకేష్ పాదయాత్రలో ప్రజలతో మమేకం అవుతున్న విధానం అందర్నీ ఆకట్టుకుంటోంది. ప్రజలు చెప్పే సమస్యలను సావధానంగా వింటున్నరు. ఆ కష్టాలకు ప్రభుత్వ విధానాలు ఎలా కారణం అయ్యాయి.. గతంలో ఎలా ఉండేది.. తాము వస్తే ఏం చేస్తామో విడమర్చి చెబుతున్నారు. వారిలో భరోసా నింపుతున్నారు. మొత్తంగా లోకేష్ .. ప్రజలతో మమేకం విషయంలో ఎవరికైనా అనుమానాలుంటే.. రెండో రోజు నుంచే పటాపంచలు చేస్తున్నారని అనుకోవచ్చు.