వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుల్ని అధికార పార్టీ కాపాడటానికి కిందా మీదా ఎందుకు పడుతుంది ? దేనికైనా ఎందుకు తెగిస్తోంది ? ప్రజలు ఏమనుకుంటారోనన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా చూపించకుండా.. ఏమైనా అనుకోనీ అని వారిని రక్షించాలని ఎందుకు తాపత్రయ పడుతోంది ? వీటన్నింటికీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ తర్వాత చాలా మందికి క్లారిటీ వచ్చినట్లుగా కనిపిస్తోంది. సీబీఐ అధికారులు ప్రధానంగా అవినాష్ రెడ్డి కాల్ డేటా… గురించి ఆరా తీశారు. ఆ సమయంలో ఎయన ఎవరెవరికి ఫోన్లు చేశారు.. ఏం మాట్లాడారో అడిగారు. నిజానికి ఆ సమాచారం అంతా సీబీఐ దగ్గర ఉంది. కానీ కన్ఫర్మ్ చేసుకోవడానికే అడిగారు.
వివేకా హత్య విషయం బయటపడిన తర్వాత చాలా మంది ఫోన్ కాల్స్ అటూ ఇటూ వెళ్లాయి. వివేకా హత్య కేసు సమయంలో ఆ ఏరియా సెల్ ఫోన్ టవర్ల నుంచి తీసుకున్న వివరాలు ప్రకారం.. చాలా కాల్స్ .. హత్య జరిగిన వెంటనే హైదరాబాద్ కు వెళ్లాయన్న ప్రచారం ఉంది. ఇప్పటి వరకూ ఈ సాంకేతిక ఆధారాలను సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఇప్పుడు సీబీఐ తీసుకుంటోంది. అప్పట్లో జగన్ ప్రతిపక్ష నేతగా ఉండేవారు. లోటస్ పాండ్ కు అందిన సమాచారం ప్రకారం… విజయసాయిరెడ్డిది గుండెపోటు అని ప్రకటించారు. తరవాత మాట మార్చారు. ప్రచారం కూడా గుండెపోటు అని చేశారు. కానీ వీరందరికీ అది హత్య అని తెలుసు.
ఇదే విషయాన్ని సీబీఐ హైలెట్ చేయడంతో.. అవినాష్ ెడ్డి ఫోన్ చేసిన వారికి.. ఫోన్ కాల్స్ అందుకున్న వారికి అసలు టెన్షన్ ప్రారంభమయిందని అంటున్నారు. కేసు విచారణ ముందుకు సాగితే తాము కూడా ఇరుక్కుంటామన్న ఆందోళనతో వారు ఉన్నారని స్పష్టంగా బయటపడుతోందని చెబుతున్నారు. కారణం ఏదైనా… సీబీఐ సీరియస్ గా చేధించాలనుకుంటే వివేకా హత్య కేసులో సంచలన విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.