గుండెపోటు వచ్చిన ఓ మనిషి చావు బతుకుల్లో ఉంటే అతనిపై మాజీ మంత్రి అనిల్ కుమార్ మాట్లాడిన వీడియో చూసిన తరవాత ఎవరికైనా మనం మనుషులం అనే సంగతిని మార్చిపోతున్నామా అని అనిపించకమానదు. గుండెపోటుతో నిక్షేపంగా ఉండే గౌతంరెడ్డి క్షణకాలంలో కన్నుమూశారు. ఆయనను ఆస్పత్రికి తరలించారని తెలిసిన తర్వాత శత్రువులు కూడా అయ్యో.. ఆయన కోలుకోవాలని అనుకున్నారు. ఎందుకంటే… తోటి వ్యక్తిపై కోపం చూపాలంటే.. అతను చనిపోవాలని కోరుకోవడం లక్షణం కాదు.. రాక్షసత్వం. ఎవరూ చనిపోవాలని కోరుకోకూడదు. కానీ వైసీపీ నేతల తీరు వేరేగా ఉంది. ఎవరు ఎప్పుడు చనిపోతారా.. వారిపై రాజకీయం చేద్దామా అన్నట్లుగా ఉంది. మాజీ మంత్రి అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు .. వైసీపీ నేతలే కానీ మనుషులు కాదని నిరూపిచేలా ఉన్నాయి.
తారకరత్న గుండెపోటుపై వైసీపీ నేతల వెకిలి మాటలు
తారకరత్నకు పాదయాత్రలో గుండెపోటు వచ్చింది . ఆస్పత్రికి తీసుకెళ్లారు. అది మాసివ్ స్ట్రోక్. ఆయన ఆరోగ్య పరిస్థితి అంతకు ముందు ఎలా ఉండేదో వారికే తెలుసు. బయటకు తెలియదు. కానీ అలా జరిగింది. అయితే పాదయాత్రలో కుప్పకూలిపోయాడు కాబట్టి.. ఆయనకు ఏదైనా హానీ జరిగితే మాకు కావాల్సినంత స్టఫ్ వస్తుందన్న ఆశ వైసీపీ సోషల్ మీడియాలో కనిపించింది. విదేశాల్లో వైద్యులమని చెప్పుకునేవారు కూడా అత్యంత అసహ్య కరంగా స్పందించారు. ఓ మనిషి ప్రాణం విలువ వైద్యులకే తెలియలేదు.. ఇక ఐదు రూపాయ.ల కోసం పేటీఎం కూలీలుగా ఉన్న వారికేం తెలుస్తుంది. దేనినైనా ఎగతాళి చేస్తూ మాట్లాడటం.. ఆ చావులతో రాజకీయం చేయడమే వారికి తెలుసు.
శ్యామ్ కలకడ ను గుర్తు చేసుకుంటే వైసీపీ సోషల్ మీడియాకు తెలివి వస్తుంది !
ఇలా మాట్లాడుతున్న వారికి శ్యామ్ కలకడ గుర్తుండకపోవచ్చు. ఆయన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త. ఉద్యోగాన్ని వదులుకుని జగన్ గెలవడానికి విస్తృతంగా శ్రమించారు. అప్పట్లో ఆయన కూడా ఇలాంటి వికారమైన పోస్టులే పెట్టేవారు. అది వైసీపీ బ్రాండ్ అనుకునేవారు. ప్రత్యర్థి పార్టీల్లోని మహిళల్ని కించపర్చడం దగ్గర్నుంచి చావుల్ని ఎగతాళి చేయడం … చావాలని కోరుకోవడం ఇలా చేసేవాడు. ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తరవాత ఆయనను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో బెంగళూరు వెళ్లి ఏదో ఉద్యోగం చేసుకుంటూ ఉన్న సమయంలో అనారోగ్యంతో చనిపోయాడు. అనారోగ్యంతో ఉన్నప్పుడు పార్టీ నుంచి ఎలాంటి సాయం అందలేదు.. సరైన వైద్యం అందక చనిపోతే పట్టించుకున్న వారు లేరు. ఒకప్పుడు చావుల్ని ఎగతాళి చేసిన ఆయనే అలాంటి చావును చూశాడు. అది వైసీపీ లో అందరికీ తెలుసు. అయినా కొత్త బిచ్చగాళ్లు వస్తూంటారన్నట్లుగా ఆ పార్టీ లో అలాంటి వారు తయారవుతునే ఉన్నారు.
ఇప్పటికైనా మనుషులన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి !
తారకరత్న నిజానికి నందమూరి కుటుంబసభ్యుడే కావొచ్చు.. కానీ ఆయన మా అల్లుడు అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గర్వంగా ఓ సారి చెప్పుకున్నారు. విజయసాయిరెడ్డి చెల్లెలి కూతుర్ని తారకరత్న చేసుకున్నారు. అందు కోసం కుటుంబాన్ని కూడా లెక్క చేయలేదు. ఆయన ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఆయన ఎవరిని దూషించిన దాఖలాలు లేవు. కానీ వైసీపీ నేతలు తమ పార్టీ ముఖ్య నేత అల్లుడని తెలిసి కూడా చావుపై అలాంటి కబుర్లు చెబుతున్నారంటే.. వారికి ఇక మనిషిగా ఉండే అర్హత లేదు. రేపు వారికి ఇలాంటి పరిస్థితి వస్తే అంతకు మించి నవ్వేవాళ్లుంటారు. ఎందుకంటే అలాంటి వాళ్లను ఆయనే తయారు చేసుకుంటున్నారు. ఇది మానవత్వాన్ని హరింప చేయడమే. అందుకే వైసీపీ లీడర్స్ మీరు రాజకీయ నాయకులే కావొచ్చు కానీ మనుషులనే సంగతిని కూడా గుర్తు పెట్టుకోండి.