అల్లు కుటుంబానికీ బాలయ్యకూ అనుబంధం ఈమధ్య బాగా బలపడింది. ఆహాలో.. అన్ స్టాపబుల్ కి బాలయ్య హౌస్ట్ గా రావడం దగ్గర్నుంచి ఈ బాండింగ్ స్ట్రాంగ్ అవ్వడం మొదలైంది. అఖండ ప్రీ రిలీజ్‌కి బన్నీ అతిథిగా వెళ్లాడు. ఊర్వశివో.. రాక్షసివో ప్రమోషన్లలో బాలయ్య కనిపించాడు. అలా… ఇచ్చిపుచ్చుకోవడం ఇద్దరికీ అలవాటైంది. వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్‌కి బన్నీ వస్తాడని అంతా అనుకొన్నారు. కానీ.. ఈ సినిమాకి పోటీగా `వాల్తేరు వీరయ్య` ఉండడంతో.. బన్నీ ఆ ఫంక్షన్‌కి వెళ్లలేదు. అయితే ఇప్పుడు బాలయ్యపై తన అభిమానాన్ని చాటుకొన్నాడు బన్నీ.
ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ విశాఖపట్నంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ గ్యాప్ లో.. విశాఖ లోని మాస్ థియేటర్లో బన్నీ `వీర సింహారెడ్డి` చూశాడట. ఈ సినిమా బన్నీకి బాగా నచ్చిందని అందుకే బాలయ్యకు ఫోన్ చేసి తన అభినందనలు తెలిపాడని సమాచారం. ఈ సినిమా విజయంతో దర్శకుడు గోపీచంద్ మలినేని ఫుల్ ఖుషీగా ఉన్నాడు. తాజాగా రజనీకాంత్ ఫోన్ చేసి అభినందనలు తెలపడంతో.. ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.