ఓ అగ్ర తార చనిపోయిన మరుక్షణం.. బయోపిక్ తీస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వస్తుందేమో..? ఈమధ్య అలానే జరిగింది. ఇప్పుడు జమున విషయంలోనూ ఇలానే ఆలోచిస్తోంది చిత్రసీమ. దాదాపు 200 చిత్రాల్లో నటించి, అగ్ర తారగా గుర్తింపు పొందిన జమున ఇటీవలే ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఇంతలోనే ఆమె బయోపిక్ టాపిక్ బయటకు వచ్చింది. ఓ కోలీవుడ్ దర్శకుడు.. జమున బయోపిక్ తీయాలని డిసైడ్ అయ్యాడట. జమున పాత్ర కోసం తమన్నాని సంప్రదించే పనిలో బిజీగా ఉన్నాడని టాక్.
జమున జీవితంలో `సినిమాటిక్` విషయాలు చాలానే ఉన్నాయి. ఆమె అగ్రతారగా కొనసాగింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి ఉద్దండుల చిత్రాల్లో కథానాయికగా నటించింది. ఒకప్పుడు వారిద్దరే.. జమునని దూరం పెట్టారు. మూడేళ్ల పాటు సినిమాలు చేయలేదు. అయినా సరే, నిలదొక్కుకొంది. మళ్లీ సినిమాల్లోకి వచ్చింది. మళ్లీ హిట్లు కొట్టింది. జమునలో భానుమతి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆమె డేరింగ్ అండ్ డాషింగ్. ఎవరికీ తలొంచేది కాదు. ఇవన్నీ సినిమా కథకు పనికొచ్చే విషయాలే. కాకపోతే… సావిత్రి కథలోలా జమున కథలో హ్యూమన్ ఎమోషన్లు బలంగా ఉంటాయా? అనేది ఆలోచించుకోవాలి. జమున పాత్రలో తమన్నాని ఊహించుకోవడం కూడా బాగానే ఉంది. మరి.. ఈ ప్రాజెక్టు వర్కవుట్ అవుతుందో, లేదో చూడాలి.