యాభై ఏళ్లు దాటిన జగన్మనోహన్ రెడ్డి చంద్రబాబును ముసలాయన అని సంబోధించడం ప్రారంభించారు. చేదోడు పథకం కింద గట్టిగా నియోజకవర్గానికి రెండు వేల మందికి కూడా లబ్ది చేకూర్చని పథకానికి .. రూ.కోట్లు ఖర్చు పెట్టి ప్రకటనలు ఇచ్చుకుని .. భారీగా ఖర్చు చేసి బహింగసభ ఏర్పాటు చేసుకుని మరీ వినుకొండలో బటన్ నొక్కిన సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా రాజకీయ ప్రసంగమే చేశారు. చంద్రబాబును పదే పదే ముసలాయన అంటూ సంబోధించారు. గతంలో ముసలాయనప్రభుత్వం ఉండేదని.. ఆ ప్రభుత్వంో అంతా దాచుకో.. దోచుకో..తినుకో అన్నట్లుగా ఉండేవారన్నారు. ఆ ముసలాయన ప్రభుత్వంలో చేసిన దాని కన్నా తక్కువే అప్పులు చేశామని చెప్పుకొచ్చారు.
ఆ ముసలాయన ఇప్పుడు తాము ఇస్తున్నట్లుగా బటన్ నొక్కి పథకాలకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అప్పుడూ ఇప్పుడు ఉన్నది ఒకే రాష్ట్రం.. ఒకేబ డ్జెట్ అన్నారు. ఆ ముసలాయన ప్రభుత్వంలో తెచ్చిన అప్పులన్నీ ఏం చేశారని జగన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో తోడేళ్లన్నీ ఒకటవుతున్నాయని.. తాను తాను మాత్రం సింగిల్ గా సింహంలాగా వస్తానని చెప్పుకొచ్చారు మీ బిడ్డకు భయం లేదు…తాను దేవుడ్ని ప్రజల్ని నమ్ముకున్నానని సెంటిమెంట్ కురిపించే ప్రయత్నంచేశారు. జగన్మోహన్ రెడ్డి పర్యటన ..,ప్రసంగాలు ఎప్పుడూ ఒకలేగా సాగుతున్నాయి. దీంతో ఎవరికీ ఆసక్తి లేకుండా పోయింది.
అయితే కొత్త చంద్రబాబును వయసు పేరుతో కించ పర్చే ప్రయత్నం చేయడం మాత్రం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. జగన్ మోహన్ రెడ్డి నిత్య యవ్వనుడిగా ఉంటారా అన్న సహజంగానే ఎవరికైనా వస్తుంది. చంద్రబాబు వయసును చూపించి.. తానే భవిష్యత్ అని ప్రజలకు చెప్పే ప్రయత్నం జగన్ చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. అయితే కనీసం వయసుకు కూడా గౌరవం ఇవ్వని ముఖ్యమంత్రి అనే పేరు పడిపోతుందన్న వాదన వినిపిస్తోంది.