తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్‌తో జరిగిన వాగ్వాదంలో తాము తెలంగాణలో యాభై సీట్లలో పోటీ చేస్తామని పదిహేను మంది ఎమ్మెల్యేలతో సభలో అడుగుపెడతామని ప్రకటించారు. వెంటనే కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగిపోయారు. మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు అసెంబ్లీలో అక్బరుద్దీన్ తో చర్చలు జరిపారు. అలా చర్చలు జరిపినట్లుగా మీడియాకు లీక్ చేశారు. తామే మళ్లీ మీడియా ముందుకు వచ్చి అలాంటిదేమీ లేదని.. ఉత్తినే … మాట్లాడుకున్నామని ఊహాగానాలు మరింతగా పెంచే ప్రయత్నం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో మజ్లిస్ కు ఉన్న ప్రాధాన్యత వేరు. ఆ పార్టీ మద్దతిస్తే చాలా నియోజకవర్గాల్లో కలసి వస్తుంది.
గతంలో మజ్లిస్ .. కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా ఉండేది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీతోనే సన్నిహితంగా ఉండేది. పాతబస్తీలో మాత్రమే పోటీ చేసి.. ఇతర చోట్ల కాంగ్రెస్ పార్టీకి పరోక్ష మద్దతు ఇచ్చేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ పార్టీ బీఆర్ఎస్ తో సన్నిహితంగా ఉంటోంది. గత ముందస్తు ఎన్నికల్లో గ్రేటర్ మనహా ఇతర చోట్ల బీఆర్ఎస్ పార్టీకి మజ్లిస్ పరోక్ష సహకారం అందించింది.
అయితే ఈ సారి మాత్రం మజ్లిస్ పార్టీని విస్తరించాలన్న ఆలోచన చేస్తున్నారు. ఈ కారణంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న చోట్ల అభ్యర్థుల్ని నిలపాలని అనుకుంటున్నారు. ఆ ప్రచారం జరుగుతూండాగనే.. అక్బరుద్దీన్ అసెంబ్లీలో యాభై సీట్ల ప్రస్తావన చేశారు. కుదిరితే మజ్లిస్ తో పాత సంబంధాలను కలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తోంది. మజ్లిస్ ముందుకు వస్తే నేరుగా పొత్తు కాకపోయినా… రాజకీయ సహకారం ప్రకారం… వారు అడిగిన పదిహేను సీట్లలో సహకరించవచ్చన్న ప్రచారమూ జరుగుతోంది. కానీ అసదుద్దీన్.. కాంగ్రెస్ గెలుస్తుందంటే మాత్రమే ఆలోచిస్తారు.