కైకలూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గా నిన్నటి వరకూ వ్యవహిరంచిన జయమంగళ వెంకటరమణ కృషిని వైసీపీ అధినేత జగన్ గుర్తించారు. ఆయనకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చారు. ఇది కాస్త విచిత్రంగా ఉన్న నిజమే. ఎమ్మెల్సీ ఇస్తామని ఆయనను ఆకర్షించి టీడీపీలో చేర్చుకున్నారు., ఈ మేరకు సీటు కూడా కన్ఫర్మ్ చేశారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో కలిసి ఆయన సీఎం జగన్ ను కలిశారు. స్థానిక సంస్థల కోటాలో 23న నామినేషన్ వేయాలని జగన్ సూచించారు.
స్థానిక సంస్థల కోటాలో ఎనిమిది ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీకి దక్కనున్నాయి. ఇందులో మొదటి సీటును టీడీపీ నేతకే ఇచ్చారు. ఇంత కాలం వైసీపీ కోసం పని చేసిన వారు ఈ పదవుల పంపకంతో నిరాశకు గురవుతున్నారు. ప్రతిపక్షంలో ఉండి పోరాడి.., పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటే.. మళ్లీ పదవులు టీడీపీ నేతలకే వెళ్తున్నాయని నిరాశకు గురవుతున్నారు. కైకూలురులో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేనే ఉన్నారు. ఆయనతో కూడా జయమంగళ వెంకటరమణ రాజీ పడిపోయారు.
ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చిన వారు పదుల సంఖ్యలో ఉంటారు.మంత్రిని కూడా చేస్తామని చెప్పి అసలు పట్టించుకోకుండా పక్కన పడేసిన వాళ్లు చాలా మంది ఉన్నారు. వీరిలో ఎవరికీ టిక్కెట్లు ఇవ్వకుండా.. ఎమ్మెల్సీ పదవులు కూడా ఇవ్వకుండా.. ఇలా టీడీపీ నుంచి వచ్ిచన వారికి తెచ్చి అవకాశాలు కల్పించడం ఏమిటని క్యాడర్ లో చర్చ ప్రారంభమయింది. దీన్ని ఆ పార్టీ నేతలు ఎలా సమర్థించుకుంటారో మరి..!