జగన్ తండ్రి వైఎస్ ఆత్మగా ప్రసిద్ది చెందిన కేవీపీ రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. జగన్ రానివ్వలేదో… కేవీపీ వెళ్లలేదో స్పష్టత లేదు కానీ ఆయన ఇటీవలి కాలంలో జగన్ కు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఆయన పోలవరం విషయంలో రాష్ట్రానికి ద్రోహం చేయవద్దని లేఖ రాశారు. పోలవరం విషయంలో ఎత్తు తగ్గించాలని కేంద్రం చేస్తున్న ఒత్తిడికి తొలగ్గితే రాష్ట్ర ద్రోహానికి పాల్పడినట్లేనని జగన్ కు లేఖ రాశారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోవడం దురదృష్టకరమన్నారు. నిధులు లేవి కేంద్రం పోలవరం ఎత్తు తగ్గించే ఆలోచనలో ఉందని కేవీపీ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రాజెక్టు నిర్మాణం మొత్తం రాష్ట్రం చేతుల్లో ఉందన్నరు. కేంద్రం చేస్తున్న ఒత్తిడికి తలొగ్గవద్దని.. ఎత్తు తగ్గి్తే.. ఏపీ చాలా నష్టపోతుందన్నారు. పోలవరం ఎత్తుు తగ్గకుండా నిర్మాణం చేపట్టాలని .. ఒక వేల పోలవరం ఎత్తు తగ్గిస్తే ద్రోహం చేసినట్లేనని కేవీపీ పేర్కొన్నారు. పోలవరం ఎత్తు తగ్గించవద్దంటూ ఇంతకు ముందు రోజే ప్రధానికి కూడా లేఖలు రాశారు.
కేవీపీ వివేకానందరెడ్డి హత్య కేసులోనూ ఘాటుగా స్పందించారు. అంత దారుణంగా హత్య చేసిన ఎవరికైనా శిక్ష పడాల్సిందని స్పష్టం చేశారు. హంతకులకు శిక్షలు పడకపోతే ఇక న్యాయానికేమీ విలువ ఉండదరన్నారు. అలా హత్యలు చేసిన వాళ్లు రాక్షసులతో సమానం అన్నారు. తర్వాత మరో సందర్భంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీయించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్… అందరికీ దూరమయ్యారు. అందరూ ఆయన తీరును విమర్శిస్తున్నారు. ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డిని మాత్రమే జగన్ నమ్ముకున్నారు.