రాజకీయం చేయాలనుకోవాలి కానీ జరిగే ప్రతి విషయానికీ తమ వ్యతిరేక పార్టీకి లింక్ పెట్టేసుకోవచ్చు. ఏ నేరం జరిగినా దానిలో నిందితులు మీ పార్టీ వారేనని మీ అగ్రనేతలకు సంబంధం ఉందని ఆరోపణలు చేసేస్తూ ఉంటారు నేతలు. ఇప్పుడు తెలంగాణలో పేపర్ లీకేజీ రాజకీయం నడుస్తోంది. ఈ రాజకీయం కూడా అంతే. ఈ కేసు బయటపడగానే.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. బీఆర్ఎస్ పెద్దల హస్తం ఉందని కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అక్కడి నుంచి ప్రారంభమైన రాజకీయ వివాదం అంతకంతకూ పెరుగుతూనే ఉంది.
ఈ కేసులో ఏ2గా ఉన్న నిందితుడు రాజశేఖర్రెడ్డి బీజేపీ పార్టీ కార్యకర్త అని కేటీఆర్ రిట్వీట్ చేశారు. ఈ విషయంలో తగిన దర్యాప్తు నిర్వహించాలని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ను ట్విట్టర్ ద్వారా కోరారు. రాజకీయ పార్టీగా బీజేపీ అత్యంత దిగజారుడు చర్యలకు పాల్పడుతోందని, ప్రస్తుత పరిణామం ఆ పార్టీ మరింత దిగజారుడు రాజకీయా లకు నిదర్శనమని ఘాటుగా వ్యాఖ్యానించారు. వెంటనే బండి సంజయ్ కూడా అందుకున్నారు. ఈ కేసులో ఏ త్రీ నిందితురాలిగా ఉన్న రేణుకా రాథోడ్ తల్లి బీఆర్ఎస్ సర్పంచ్ అని ఓ మిడీయాలో వచ్చిన వార్తను పోస్ట్ చేసి… మొత్తం గుట్టు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
నిజానికి దిగువ స్థాయి రాజకీయ వ్యవహారాల్లో పాలు పంచుకునే ఈ నిందితులకు పెద్ద స్థాయి నేతలతో కనీసం పరిచయాలు కూడా ఉండవు. కానీ నఈ కేసు బయటపడేసరికి వారిని పెద్ద లీడర్లుగా మార్చేసి రాష్ట్ర నేతలు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. గతంలోనూ తెలంగాణలో ఇలాంటి పేపర్ లీక్ కేసులు బయటపడ్డాయి. కానీ తీసుకున్న చర్యలు పెద్దగా లేవు. ఇప్పుడు కూడా రెండు పార్టీలు చేయాల్సినంత రాజకీయం చేసుకుని సైలెంట్ అవుతాయన్న విమర్శలు అందుకే వస్తున్నాయి.