విశ్వక్ సేన్ మంచి నటుడు. తక్కువ కాలంలోనే తన క్యాలిబర్ ని నిరూపించుకున్నాడు. అయితే విశ్వక్ లో దర్శకుడు కూడా వున్నాడు. దాస్ కా దమ్కీ కి ఆయనే హీరో దర్శకుడు కూడా. అయితే ఈ సినిమా ప్రీరిలీ ఈవెంట్ లో ఎన్టీఆర్, విశ్వక్ కి ఓ ఆర్డర్ వేశారు. విశ్వక్ వెంటనే దర్శకత్వం ఆపేయాలని అన్నారు.
‘’విశ్వక్ నటన చూసి నేను షాక్ అవుతుంటా. ఇంత తక్కువ సమయంలో అంత పరిణితి అందరికీ సాధ్యపడదు. ఇది విశ్వక్ పూర్వజన్మ సుకృతం. తనని తాను ప్రూవ్ చేసుకోవాలని భావించే నటుడు విశ్వక్. ఇప్పుడు తన దర్శకత్వంలో దాస్ కా ధమ్కీ’ చేస్తున్నాడు. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఎందుకంటే తను దర్శకత్వం ఆపేయాలని కోరుకుంటున్నాను. బయట చాలా మంది దర్శకులు వున్నారు. కొత్తకొత్త వాళ్లకి విశ్వక్ లాంటి వారు అవకాశాలు ఇవ్వాలి. అలాంటి వాళ్ళని చూసి మేము వాళ్ళతో సినిమాలు చేయాలి. అందుకే ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి దర్శకత్వం ఆపేయాలి” అంటూ నవ్వుతూ విశ్వక్ కి సలహా లాంటి ఆర్డర్ వేశారు ఎన్టీఆర్.