తమ పార్టీ తరపున నలుగురు క్రాస ఓటింగ్ చేశారని చేశారని గుర్తించామని వారిని సస్పెండ్ చేసింది వైసీపీ హైకమాండ్. ఇప్పుడు వైసీపీ నేతలు మరి టీడీపీ ఎమ్మెల్యేల్ని సస్పెండ్ చేయరా అని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతు పలికారు. విప్ జారీ చేసినా వైసీపీకి ఓటేశారు. సీక్రెట్ ఓటింగ్ కాబట్టి వారు నిజంగా ఎవరికి ఓటు వేశారో తెలియదు. అధికారికంగా తెలియదు కానీ అనధికారికంగా వారు వైసీపీ అభ్యర్థులకే ఓట్లేశార.
తాము ధైర్యంగా తమ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశామని.. మీరు కూడా సస్పెండ్ చేయాలని టీడీపీ నేతల్ని సవాల్ చేస్తున్నారు వైసీపీ నేతలు. నిజానికి ఈ నలుగుర్ని సరైన సమయంలో సస్పెండ్ చేస్తామన్న వైసీపీ హైకమాండ్.. వీరిపై చర్యలు తీసుకోపతే మిగతా వారు ధిక్కరిస్తారన్న భయంతో వెంటనే చర్యలు తీసుకుంది. అధికార పార్టీకి అది అవసరం. టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయకపోయినా… చేసినా ఆ పార్టీకి వచ్చేదేమీ లేదు. అయితే వారిపై అనర్హతా వేటు వేయాలని గతంలోనే ఫిర్యాదు చేశారు. ఆ అనర్హతా వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉపఎన్నికల్లో తేల్చుకుందామని అంటున్నారు. దీనపై మాత్రం వైసీపీ నేతలు మాట్లాడటం లేదు.
సస్పెండ్ చేస్తే వారు హాయిగా వెళ్లి వైసీపీలో చేరిపోతారు. అలాంటి చాన్స్ ఇవ్వకుండా.. అనర్హతా వేటు వేసే పరిస్థితుల కోసం టీడీపీ ఎదురు చూస్తోంది. అయితే ఇలా ఎప్పుడైనా టీడీపీ విప్ ను ధిక్కరించాల్సిన పరిస్థితుల్లో ఆ నలుగురు ఎమ్మెల్యేలు తప్పించుకుటున్నారు.త ప్రభుత్వానికి మద్దతుగా ఉండటం లేదు. దాంతో బయటపడిపోతున్నారు. సస్పెండ్ చేయడం పెద్ద విషయం కాదని.. దమ్ముంటే వైసీపీ, టీడీపీ, జనసేనకు చెంది… ధిక్కరించిన 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయాలని.. ఉపఎన్నికలకు వెళదామని సవాల్ చేస్తున్నారు.